వివేకా హత్యకేసు: లోటస్ పాండ్ కమల్ హాసన్.. జగన్ యాక్టింగ్ మామూలుగా లేదుగా: లోకేష్ సెటైర్లు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ పదేపదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసింది ఎవరో జగన్ కు తెలుసని, వారిని జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది టిడిపి.
Recommended Video
జగన్ లోటస్ పాండ్ కమల్ హాసన్.. లోకేష్ సెటైర్లు
ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ను విచారించాలని, జగన్ కాల్ డేటాను పరిశీలించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. ఇక తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . సోషల్ మీడియా వేదికగా జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్ లోటస్ పాండ్ కమల్ హసన్.. నీ యాక్టింగ్ మామూలుగా లేదుగా అంటూ వైయస్ వివేకానంద రెడ్డి హత్య రోజున జగన్ మాట్లాడిన వీడియో ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి అంతా తెలిసినా ఏమీ తెలియనట్టు నాటకాలాడుతున్నారని ఆ వీడియోను పోస్ట్ చేసి లోటస్ పాండ్ కమల్ హాసన్ అంటూ సెటైర్లు వేశారు లోకేష్.
వివేకా హత్యలో జగన్ పాత్రపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
అంతేకాదు గొడ్డలి పోటు నుండి గుండెపోటు డ్రామా వరకూ ఉన్న మిస్టరీ వీడిపోయింది అని పేర్కొన్నారు. బాబాయ్ వివేకా ని అత్యంత కిరాతకంగా చంపేసిన అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి రెండు కళ్ళని చెప్పడం, సీబీఐ కి అప్పగిస్తే ఇది 12వ కేసవుతుందని అనడం చూస్తుంటే వివేకా హత్యకు స్కెచ్ వేసింది జగన్ రెడ్డేనని స్పష్టంగా అర్థమవుతోంది అని నారా లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వివేకా హత్య లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు.

కేసులో వాంగ్మూలాలను బట్టి జగన్ పాత్ర ఉందని నిర్ధారణ అయ్యిందన్న లోకేష్
వివేకానంద రెడ్డి హత్యకు స్కెచ్ వేసిన ఇద్దరూ బ్రహ్మాండంగా యాక్టింగ్ చేస్తున్నారని, ఎన్నికల్లో గెలవడం కోసం కోడి కత్తి కేసులాగా దీనిని చిత్రీకరించి ఉంటారని నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్ ను విచారిస్తే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. దోషులను కాపాడడం కోసం జగన్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఈ హత్య కేసులో తన పాత్ర లేకుంటే జగన్ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని లోకేష్ ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి, ఇప్పటివరకు ఈ కేసులో ఇచ్చిన వాంగ్మూలాలను బట్టి ఈ కేసులో జగన్ పాత్ర ఇట్టే అర్థమవుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు.

సీబీఐ తక్షణం జగన్ ను విచారించాలని డిమాండ్
సిబిఐ తక్షణం జగన్ ను విచారించాలని డిమాండ్ చేశారు లోకేష్ . ఇప్పటికే ఈ కేసులో సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం పెద్దఎత్తున దుమారం రేపింది. వారు జగన్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో సజ్జల రామకృష్ణా రెడ్డి ఎదురు దాడికి దిగారు. సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు చేతిలో పావులుగా మారారని ఆయన ఆరోపించారు. జగన్ వ్యక్తిత్వ హననం చెయ్యటానికి టీడీపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఇక సజ్జల వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్ళు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications