అనుమానించాల్సిందేమి లేదు, అందుకే బాబును 'జీఈఎస్'కు పిలవలేదు: లోకేష్

Subscribe to Oneindia Telugu

అమరావతి: నవంబర్ 28, 29 తేదీల్లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుమారు 1500మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సుకు.. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సు వేళ చాలామందికి ఒక సందేహం కలిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తుందా? లేదా? అని. అయితే సదస్సు జరిగింది కేంద్రం ఆధీనంలోని నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కాబట్టి.. సదస్సుకు ఎవరిని పిలవాలి? అనేది వారే నిర్ణయించారు.

nara lokesh response over no invitaion for chandrababu naidu to GES in hyderabad

తాజాగా ఇదే విషయాన్ని ఏపీ ఐటీ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో సదస్సు జరపాలని నిర్ణయించుకుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే పిలుస్తుందని చెప్పారు. జీఈఎస్‌కు చంద్రబాబును మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందలేదని గుర్తుచేశారు. ఇందులో పెద్దగా అనుమానించాల్సిందేమి లేదని చెప్పుకొచ్చారు.

శుక్రవారం నాడు వరుసగా ఏడో ఏడాది తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన సందర్భంగా లోకేష్ దీనిపై స్పందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Minister Nara Lokesh responded over Global Entrepreneurship Summit 2017, conducted by NITI AYOG in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X