ఓరి నీ పాసుగాల! క్యాడర్ కు పాసులేందయ్యా..! జగన్ పై లోకేష్ సెటైర్లు..!
ఏపీలో ఒకప్పుడు వైసీపీ పాలనలో సీఎంగా ఉన్న జగన్ వస్తున్నారంటే పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయడం చూశాం. గత ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఆ హంగామా అంతా వదిలేసి సాధారణ కార్యకర్తలతో మమేకం కావడం చూస్తున్నాం. కానీ ఉన్నట్లుండి నిన్న పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో మాత్రం వైఎస్ జగన్ సొంత పార్టీ కార్యకర్తలు, సొంత నియోజకవర్గ ప్రజలు కలిసేందుకు వస్తే పాసులు పెట్టడం చర్చనీయాంశమైంది.
నిన్న పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో వైసీపీ .. జగన్ ను కలిసేందుకు వచ్చిన వారికి ఇచ్చిన పాసులు ఇవాళ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఏపీ మంత్రి నారా లోకేష్ వీటిపై ఎక్స్ లో స్పందించారు. జగన్ తీరుపై లోకేష్ సెటైర్లు వేశారు. ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.... సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! అంటూ లోకేష్ సెటైర్లు సంధించారు.

ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.... సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! @ysjagan pic.twitter.com/0jGiccnL5A
— Lokesh Nara (@naralokesh) September 2, 2025
తన తండ్రి వైఎస్సార్ వర్థంతి సందర్భంగా పులివెందులలోని ఇడుపులపాయలో ఉన్న ఘాట్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగన్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్బంగా ముందు రోజు పులివెందుల ప్రజలతో కలిసి వారి సమస్యలు విన్నారు. అయితే భారీ సంఖ్యలో జనం వస్తారన్న సమాచారంతో ఇలా తొలిసారి పాసులు ఏర్పాటు చేసి అనుమతించినట్లు తెలుస్తోంది. ఇధి కాస్తా బూమరాంగ్ కావడంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. జగన్ పాసుల వ్యవహారంపై పలువురు మంత్రులు, టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.












Click it and Unblock the Notifications