పేరులో తేడా అంతే!: లోకేష్ జగన్ తరహా యాత్ర

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ కార్యకర్తల సంక్షేమ యాత్ర మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కుప్పం సమీపంలోని రాజీవ్ నగర్‌లో చనిపోయిన టీడీపీ కార్యకర్త వెంకటేష్‌ కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించారు.

కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం రూ.2 లక్షల చెక్కును వారికి అందించారు. అనంతరం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని ఐరాల మండలం పుత్తమద్ది, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని పొంగనూరు మండలం మాదనపల్లి, తిరుపతి నియోజకవర్గం పరిధిలోని శెట్టిపల్లి గ్రామాల్లో లోకేష్‌ పర్యటించి ప్రమాదంలో చనిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు.

Nara Lokesh's tour starts from Kuppam

కాగా, నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమ యాత్ర ఓ రకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర వంటిదే అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కోసం జగన్ ఓదార్పు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అది ఏళ్ల పాటు సాగుతోంది. ఇప్పుడు టీడీపీ కార్యకర్తల కోసం లోకేష్ కార్యకర్తల సంక్షేమ యాత్ర చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+