వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చినబాబు ఆస్తుల చిట్టా ఇదే: హెరిటేజ్‌లో నారా లోకేశ్ వాటా విలువెంతో తెలుసా..?

హెరిటేజ్ సంస్థలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ వాటా షేర్ల విలువ ఎంతో వెల్లడైంది. హెరిటేజ్‌ సంస్థలో రూ.273 కోట్లుగా ఉందని స్పష్టమైంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: హెరిటేజ్ సంస్థలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ వాటా షేర్ల విలువ ఎంతో వెల్లడైంది. హెరిటేజ్‌ సంస్థలో రూ.273 కోట్లుగా ఉందని స్పష్టమైంది. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన లోకేశ్ దానికి అనుబంధంగా వేసిన అఫిడవిట్‌లో ఈ విషయం తెలియజేశారు.

ఎమ్మెల్సీలు ఏకగ్రీవం: నారా లోకేష్ సహా 5గురు టిడిపి, ఇద్దరు జగన్ పార్టీఎమ్మెల్సీలు ఏకగ్రీవం: నారా లోకేష్ సహా 5గురు టిడిపి, ఇద్దరు జగన్ పార్టీ

కాగా, లోకేష్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.330 కోట్లకుపైగా ఉంది. ఇందులో హెరిటేజ్‌ కంపెనీ షేర్లదే ప్రధాన వాటాగా ఉంది. లోకేష్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రాలతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాలు వెల్లడించారు. అఫిడవిట్‌లను మంగళవారం శాసనసభ నోటీసు బోర్డులో ఉంచారు. ఆ వివరాలు..

విద్యార్హత: ఎంబీఏ (స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీ, అమెరికా)
చరాస్తులు: రూ.273,83,94,996 (హెరిటేజ్‌ షేర్ల రూపంలో)
స్థిరాస్తులు: రూ.18,00,98,738
వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు: రూ.38,51,09,546
రుణాలు: రూ.6,27,17,417
భార్య బ్రాహ్మణి పేరు మీద:
చరాస్తులు: రూ.17,90,60,278
స్థిరాస్తులు: రూ.9,75,80,000
రుణాలు: రూ.21,51,900
ఆభరణాలు: 2325.338 గ్రాముల బంగారం, 310.06 క్యారెట్ల వజ్రాలు, 97.441 కిలోల వెండి
కుమారుడు దేవాంశ్‌ పేరు మీద:
చరాస్తులు: రూ.2,18,55,013
స్థిరాస్తులు: 9,06,89,600
ఆభరణాలు: 7.50 కిలోల వెండి
కార్లు: ఫోర్డ్‌ ఫియస్టా 1, టొయోటా ఫార్చ్యూనర్‌ కార్లు 2

రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అధిష్టానం నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Nara Lokesh shares in heritage

లోకేష్ తోపాటు టీడీపీ నుంచి కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్, బత్తుల అర్జునుడు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరు తప్ప మరెవరు నామినేషన్లు వేయకపోవడంతో వీరంతా ఏకగ్రీవమయ్యారు.

నామినేషన్ వేసిన సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. అయితే, ఆయనకు ఐటీ శాఖను అప్పగించాలనే యోచనలో సీఎం చంద్రబాబునాయుడు ఉన్నట్లు సమాచారం.

English summary
TDP General Secretary Nara Lokesh's shares value in heritage is that Rs. 273 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X