AP Nominations: రేపు లోకేష్, ఎల్లుండి చంద్రబాబు నామినేషన్లు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రేపు రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. దీంతో పాటే ఈ రెండు ఎన్నికలకు అభ్యర్ధుల నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుకాబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. మరోసారి మంగళగిరి, కుప్పంలో పోటీకి వీరిద్దరూ సిద్ధమయ్యారు.
ముందుగా టీడీపీ యువనేత నారా లోకేష్ రేపు మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అభ్యర్ధిగా లోకేష్ మంగళగిరిలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు మంగళగిరిలోని సీతారాముల ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరనున్న నారా లోకేష్... అక్కడి నుంచి మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా ఎంటీఎంసీ కార్పొరేషన్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేస్తారు.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఎల్లుండి కుప్పం అసెంబ్లీ సీటుకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే చంద్రబాబుకు బదులుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12:33 గంటలకు భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారీ ర్యాలీతో భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేసేలా టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లుండి ఉదయం కుప్పం ఆలయంలో పూజలు చేసి, అనంతరం ర్యాలీగా వెళ్లి భువనేశ్వరి చంద్రబాబు తరఫున నామినేషన్ వేస్తారు.












Click it and Unblock the Notifications