రేపటి నుంచి మళ్లీ లోకేష్ పాదయాత్ర- 11న 3వేల మార్క్-పైలాన్ ఆవిష్కరణ..

టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర తిరిగి రేపు ప్రారంభం కానుంది. యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్రకు గతంలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఓసారి బ్రేక్ పడగా.. తాజాగా మిచౌంగ్ తుపాను ప్రభావంతో బ్రేక్ ఇవ్వక తప్పలేదు. ఇప్పుడు మిచౌంగ్ ప్రభావం తగ్గడంతో తిరిగి రేపు పాదయాత్ర ప్రారంభించేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు. త్వరలో విశాఖలో పాదయాత్ర ముగించేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.

టీడీపీ నేత నారా లోకేష్ రేపు తిరిగి యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఈనెల 4 నుంచి ఈ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. టీడీపీ నేతలు, క్యాడర్ తుఫాన్ సహాయక చర్యల్లో నిమగ్నం కావాల్సిన దృష్ట్యా పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు లోకేష్ గతంలో ప్రకటించారు. అప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ఆపిన చోట నుంచి రేపు ఉదయం 10 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారు.

nara lokesh to resume yuvagalam padayatra tomorrow after cyclone michaung break

మరోవైపు లోకేష్ పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మార్క్ కు చేరువవుతోంది. ప్రస్తుతం 2974 కిలోమీటర్లు నడిచిన నారా లోకేష్.. ఈ నెల 11న తుని రూరల్ పరిధిలోని తేటగుంట హైవేపై 3వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోబోతున్నారు. దానికి గుర్తుగా అక్కడే పైలాన్ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు నారా లోకేష్ మొత్తం 216 రోజుల్లో 2,974 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేశారు.

మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో లోకేష్ పాదయాత్రను విశాఖలో ముగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా టీడీపీ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కుప్పంలో గతేడాది ప్రారంభించిన పాదయాత్ర వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+