మళ్లీ నోరు జారిన లోకేష్: ఈసారి పీవిపై.. ఇంతకీ ఏమన్నారంటే?

వెంటనే తప్పు గ్రహించిన లోకేష్.. తెలుగు ప్రజల నుంచి పీవి ప్రధాని అయ్యారంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

న్యూఢిల్లీ: మైకుల ముందు పదేపదే తడబడుతున్న ఏపీ మంత్రి లోకేష్ మరోసారి తప్పులో కాలేసినట్లు తెలుస్తోంది. బుధవారం మాజీ ప్రధాని పీవి నరసింహారావు జయంతి సందర్భంగా మాట్లాడిన ఆయన.. మాటల మధ్యలో నోరు జారారని సమాచారం. పీవి గురించి ప్రస్తావిస్తూ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ప్రధాని అయ్యారంటూ లోకేష్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.

ఆ వెంటనే తప్పు గ్రహించిన లోకేష్.. తెలుగు ప్రజల నుంచి పీవి ప్రధాని అయ్యారంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారట. దీంతో లోకేష్ తప్పుల జాబితాలో మరో తప్పు చేరినట్లయింది. యథావిధిగా ఆయన ప్రత్యర్థులు ఇప్పుడు దీన్ని హైలైట్ చేసి కౌంటర్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

nara lokesh tongue slip again on pv birth anniversary

గతంలోనే అంబేడ్కర్ వర్థంతి సమయంలో లోకేష్ నోరు జారిన సంగతి తెలిసిందే. వర్థంతి శుభాకాంక్షలు అని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఆయన మీద తీవ్ర విమర్శలకు, సెటైర్లకు దారి తీశాయి. ప్రత్యర్థి వర్గాలు కూడా దాన్ని బాగానే ఉపయోగించుకున్నాయి. మరిప్పుడు పీవి విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయో!.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+