మంత్రిగా నారా లోకేష్ ఖాయం: చంద్రబాబు ప్లానేమిటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో ఆయన తనయుడు నారా లోకేష్ చేరడం ఖాయమైంది. ఇక ముహూర్తమే ఖరారు కావాల్సి ఉంది. ఎమ్మెల్సీగా కన్నా ఎమ్మెల్యేగానే శాసనసభలోకి అడుగు పెట్టి నారా లోకేష్ మంత్రి పదవి చేపడితే బాగుంటుందనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
నారా లోకేష్ కోసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి బుద్ధా వెంకన్న ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అయితే, మరో ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. పెనమలూరు శానససభ్యుడు బోడె ప్రసాద్ నారా లోకేష్ కోసం రాజీనామా చేస్తారని అంటున్నారు. బోడె ప్రసాద్ రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేస్తారని అంటున్నారు.
లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఇప్పటికే పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించారు. అయితే, నారా లోకేష్‌ను కేంద్రానికి పంపితే బాగుంటుందనే అభిప్రాయం కూడా కొంత మంది వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో నారా లోకేష్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడమే సరైందనే భావనకు చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు.

కేంద్ర మంత్రిగా నారా లోకేష్ పనిచేస్తే భవిష్యత్‌లో కేంద్ర రాజకీయాల్లో టిడిపి కీలక పాత్ర పోషించాల్సి వస్తే అది ఉపయోగపడుతుందని వాదించేవారున్నారు. బిజెపితో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి ఉదాసీనంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఎన్నాళ్లు బిజెపితో స్నేహం కొనసాగుతుందనే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఈ స్థితిలో లోకేష్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చడం సరైంది కాదని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు లోకేష్ కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్రం నుంచి ఏపీకి అందే సాయం విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా అది లోకేష్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అనుకుంటుననారు .
లోకేష్ కేంద్ర మంత్రివర్గంలో చేరి పెద్దగా సాధించేది ఏమీ ఉండదన్న భావన ఉంది. ఆ ప్రభావం లోకేష్ రాజకీయ భవిష్యత్ పై పడుతుందన్న సందేహాలు చంద్రబాబులో ఉన్నాయి. దీంతో లోకేష్‌ను రాష్ట్ర మంత్రిగా తీసుకుంటేనే మంచిదని, భవిష్యత్తులో తన స్థానంలో లోకేష్‌కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించడానికి వీలవుతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications