జూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు..!!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నారా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ చర్చ మొదలైంది. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ కోసం ప్రచారం చేసిన జూ ఎన్టీఆర్ ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేసారు. తాజాగా ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వచ్చింది. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పైన నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు చేసారు.

నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరింది. పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ యాత్ర కొనసాగుతోంది. లోకేష్ పాదయాత్రకు హీరో నారా రోహిత్ సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ డెఫన్స్‌లో పడిందని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్ర మున్ముందు ప్రభంజనం రేపుతుందని చెప్పుకొచ్చారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలలో వచ్చిన ఫలితాలే రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాల్లోనూ రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. ప్రజలంతా టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. దీని కారణంగానే టీడీపీ పై వైసీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Nara Rohit Reveals Jr NTR Political Entry news, says TDP will get power in next Elections

జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ తన యాత్రలో భాగంగా విద్యార్ధులతో నిర్వహించిన కార్యక్రమంలో జూ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. దీని పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ , మంత్రి రోజా ఈ వ్యాఖ్యలపైన రియాక్ట్ అయ్యారు. జూ ఎన్టీఆర్ పార్టీలోకి లోకేష్ ఆహ్వానించటం ఏంటని ప్రశ్నించారు. అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కొద్ది నెలల క్రితం జూ ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అటు టీడీపీ జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారంటూ నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ పైన చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+