వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే: తెలుగుదేశం పార్టీపై హీరో నారా రోహిత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీకి తన సేవలు అవసరం అనుకున్నప్పుడు అందిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు తనయుడు, ప్రముఖ తెలుగు హీరో నారా రోహిత్ ఆదివారం చెప్పారు. ఆదివారం ఆయన విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తాను సినిమాల్లో నటించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రౌడీ ఫెలో చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీకీ తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానన్నారు.

శ్రీవారిని దర్శించుకునన చైనా భక్తులు

చైనాకు చెందిన 15 మంది భక్తుల బృందం ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నెల రోజుల క్రితం భారత దేశానికి వచ్చిన ఈ భక్త బృందం దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నట్లు తెలిపింది. తిరుమలలో ఒక గొప్ప ధార్మిక వాతావరణం చవిచూశామని, వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తమకెంతో గొప్ప అనుభూతి కలిగిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Nara Rohit

తిరుపతి స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా నరసప్ప

తిరుపతి పోలీస్‌ అర్బన్‌ జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ-2గా నరసప్పను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండు సంవత్సరాలకు పైగా స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐగా పని చేస్తున్న నరసప్ప డీఎస్పీగా పదోన్నతి పొందారు. చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీగా బదిలీ సైతం వచ్చింది. అయితే తిరుపతి స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ -2గా మళ్ళీ బదిలీపై వచ్చారు.

సర్వభూపాల వాహనంపై అమ్మవారు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. సర్వాలంకారభూషితురాలైన అమ్మవారు సోమవారం ఉదయం సర్వభూపాల వాహనంపై ఊరేగారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సాయంత్రం 4:10 స్వర్ణపథంపై, రాత్రి 8 గంటలకు గరుడవాహనంపై అమ్మవారు ఊరేగనున్నారు.

English summary
Hero Nara Rohit says he will work for TDP if necessary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X