భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లో నారా లోకేష్.. ట్వీట్ వైరల్
టీ20 ప్రపంచకప్ లో భారత్ మరో సంచలన విజయం నమోదు చేసింది. పాకిస్థాన్ పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షమయ్యారు. మ్యాచ్ ను వీక్షించిన నారా లోకేష్.. టీమిండియా జెర్సీ ధరించి సందడి చేశారు. భారత పతాకాన్ని పట్టుకుని టీమ్ లో స్పిరిట్ నింపారు. క్రికెట్ ను మించిన థ్రిల్లింగ్ మరోటి ఉండదని ఆయన ట్వీట్ చేశారు.
Colombo is buzzing tonight! 🔥
— Lokesh Nara (@naralokesh) February 15, 2026
And I’m cheering for Team India as the giants clash - India vs Pakistan!l There’s nothing like the thrill of cricket uniting millions with one heartbeat.
Let’s go boys - make the nation proud!#INDvsPAK pic.twitter.com/xVRkfFMK4U
"కొలంబోలో వాతావరణం హోరెత్తిపోతోంది..! భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ పోరులో టీమ్ ఇండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లక్షలాది మందిని ఒకే హృదయ స్పందనతో ఏకం చేసే క్రికెట్ థ్రిల్ కు మించినది మరొకటి లేదు. దేశాన్ని గర్వపడేలా చేయండి.." అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే ఈ మ్యాచ్ కు నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్‌ను మరోసారి చిత్తు చేసింది భారత్. కొలంబోలో జరిగిన మ్యాచ్ లో పాక్‌పై 61 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో టీ20 ప్రపంచకప్ లో భారత్ కు హ్యాట్రిక్ విజయం సాధించింది. దాంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 కు చేరుకుంది భారత జట్టు.












Click it and Unblock the Notifications