Talliki Vandanam: తల్లికి వందనం డబ్బులు అప్పుడే-తాజా అప్డేట్..!
ఏపీలో కొత్త విద్య సంవత్సరం ప్రారంభమైపోయింది. విద్యార్ధులు స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నారు. అయితే ప్రతీ ఏటా వారికి ఇచ్చే కిట్లు కానీ, తల్లికి వందనం (Talliki Vandanam) డబ్బులు కానీ రాలేదు. దీంతో విద్యార్ధులతో పాటు తల్లితండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం నిధుల విడుదలకు సంబంధించి ఇవాళ మరో అప్డేట్ వచ్చింది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు అధికారులకు క్లారిటీ ఇచ్చారు.
తల్లికి వందనం పథకం కింద ఇస్తున్న రూ.13 వేలను జూలై మూడో వారంలో తల్లుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారుల సమావేశంలో అధికారులను లోకేష్ ఆదేశించారు.

ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద ఇస్తున్న మొత్తాలు అధికారికంగా రూ.15 వేలు అయినా, ఖాతాల్లో పడుతోంది మాత్రం రూ.13 వేలే. దీనిపై తల్లితండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ మొత్తం అయినా సరే సకాలంలో ఇవ్వకపోవడంతో అసంతృప్తి మరింత పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే స్కూల్స్, కాలేజీల నుంచి సేకరించిన విద్యార్ధుల వివరాలను తల్లికి వందనం పథకానికి అర్హులో కాదో క్షేత్రస్దాయిలో నిర్దారిచేందుకు సచివాలయాలకు పంపారు. ఈ పరిశీలన పూర్తి కావడానికి సమయం పడుతోంది. ఇది రాగానే అర్హుల జాబితా ఖరారు చేస్తారు. అనంతరం జూలై మూడో వారంలో తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications