ఏఐఏడీఎంకేకు సిట్టింగ్ ఎమ్మెల్యే గుడ్ బై: గెలిచిన రెండు నెలల్లోనే.. ఇక ఉప ఎన్నిక
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేకు చెందిన మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సీ విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కు సమర్పించారు. ఈ రాజీనామాను అధికారికంగా ఆమోదించినట్లు ఆయన ప్రకటించారు. విజయభాస్కర్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం అన్నాడీఎంకే వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
పుదుక్కోట్టై జిల్లాలోని విరలిమలై నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, టీవీకేకు చెందిన మురుగేశన్ పై 50 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఆయనకు పెట్టని కోట. నాలుగు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. 2011లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి వరుసగా అప్పటి నుంచి నాలుగుసార్లు..అంటే 2026, 2021, 2026 ఎన్నికల్లో విజయం సాధించారు.

పుదుక్కోట్టై జిల్లా రాజకీయాలపై ఆయనకు గట్టి పట్టు ఉంది. అత్యంత బలమైన నేతగా విజయభాస్కర్‌కు మంచి పట్టుంది. గతంలో ఎడప్పాడి పళనిస్వామి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. విరలిమలై నియోజకవర్గ పరిధిలోని క్షేత్రస్థాయి ప్రజలతో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో అతి త్వరలోనే కీలకమైన రాజకీయ పరిణామాలు నెలకొనే తరుణంలో, ఇంతటి సీనియర్ నేత తన పదవికి రాజీనామా చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే దానిపై రాజకీయ మేధావుల్లో విభిన్న రకాల విశ్లేషణలు మొదలయ్యాయి.
ప్రస్తుతానికి దీనిపై స్పష్టమైన, అధికారిక కారణాలు వెల్లడి కాలేదు. ఇప్పటివరకు విజయభాస్కర్ గానీ, ఇటు అన్నాడీఎంకే అగ్రనేతలెవరూ గానీ మీడియా ముందుకు వచ్చి అధికారిక వివరణ ఇవ్వలేదు. అన్నాడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారాల వల్ల ఈ నిర్ణయం జరిగిందా లేక వ్యక్తిగత ఒత్తిళ్ల నేపథ్యమా అనేది తేలాల్సి ఉంది. విజయభాస్కర్ రాజీనామా చేయడం, దాన్ని స్పీకర్ ఆమోదించడంతో విరలిమలై నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగడం ఖాయమైంది.
గెలిచిన ఈ రెండు నెలల వ్యవధిలోనే శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. కాగా.. ఆయన టీవీకేలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. టీవీకేలో చేరితే మళ్లీ ఆ పార్టీ తరఫున విరలిమలై నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే అభిప్రాయాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications