ఆరుద్రలోకి సూర్యుడు.. జూన్ 22 నుంచి ఈ 4 రాశులకు బంగారు యోగం
నవగ్రహాలకు అధిపతి, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి నక్షత్ర సంచారం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన మార్పులకు కారణమవుతుంది. ప్రతి నెలా రాశిని మార్చుకునే సూర్యుడు, ఈసారి తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:31 గంటలకు మృగశిర నక్షత్రం నుంచి వైదొలిగి, రాహువు నక్షత్రమైన 'అరుద్ర' లోకి ప్రవేశించబోతున్నాడు. అది చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు.
ఈ మార్పు కారణంగా అన్ని రాశుల వారి జీవితాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి మాత్రం ఈ నక్షత్ర సంచారం 'బంపర్ ఆఫర్' లాంటిదని చెప్పవచ్చు. జూన్ 22 నుంచి వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. ఆర్థికంగా ఊహించని లాభాలు వరిస్తాయి.

సింహ రాశి వారికి అప్పుల బాధల నుంచి విముక్తి!
సూర్యుడి నక్షత్ర మార్పు సింహ రాశి వారికి సరికొత్త వెలుగులను ఇవ్వబోతోంది. మీరు మనసులో అనుకున్న పనులు, చాలా కాలంగా కోరుకుంటున్న కోరికలు ఈ కాలంలో నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. పాత అప్పుల భారం నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఊహించని పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ఆల్రెడీ ప్రభుత్వ కొలువుల్లో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు సైతం దూరం అవుతాయి.
ధనుస్సు రాశి వారి వెంటే అదృష్టం
సూర్యుడి అరుద్ర నక్షత్ర సంచారం ధనుస్సు రాశి వారికి అఖండమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో అదృష్టం మీ వైపు ఉంటుంది. చేసే ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద డీల్స్, ప్రాజెక్టులు దక్కుతాయి. వీటి ద్వారా భారీగా సంపద లభిస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మునుపటి కంటే చాలా వరకు మెరుగుపడుతుంది.
మేష రాశి వారికి ధైర్యమే పెట్టుబడి
సూర్యుడి అరుద్ర నక్షత్ర ప్రవేశం మేష రాశి వారికి కొండంత అండగా మారబోతోంది. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపు అవుతాయి. ఎలాంటి కఠినమైన పనినైనా అలవోకగా పూర్తి చేస్తారు. మీలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఆఫీసులో లేదా సమాజంలో ఉన్నతాధికారుల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తుంది.ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడమే కాకుండా, రావాల్సిన మొండి బకాయిలు చేతికి అందుతాయి.
మిథున రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు
మిథున రాశి వారికి ఈ సమయం అద్భుతమైన శుభ ఫలితాలను మోసుకొస్తోంది. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాట తీరుకు ఇతరులు ఫిదా అవుతారు. మీరు చెప్పే విషయాలను పది మంది ఆసక్తిగా వింటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు చేసే వారికి లాభాల పంట పండుతుంది.












Click it and Unblock the Notifications