సీమాంధ్రులకి అభద్రతలేదు: గవర్నర్, సీఎంలకి ప్రశంస
న్యూఢిల్లీ: హైదరాబాదులో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందడన అవాస్తవమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో సోమవారం చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి విజన్‌తో పని చేస్తున్నారని చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర రావులకు కితాబిచ్చారు.

విభజన చట్టంలోని సెక్షన్ 9, 10లో ఎలాంటి వివాదం లేదని తెలిపారు. అయితే, వాటి పైన మరింత స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు. గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో కేంద్రమంత్రి అశోక గజపతిరాజుతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
బాబ్లీ ప్రాజెక్టు కమిటీలో చేర్చాలని తెలంగాణ పిటిషన్
బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీని పైన విచారణ చేపట్టిన కోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని నిర్దేశించింది. తదుపరి విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications