ఏనాడైనా పట్టించుకున్నారా: చిరంజీవిపై భగ్గుమన్న మంత్రి నారాయణ

హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి రాసిన బహిరంగ లేఖపై ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ భగ్గుమన్నారు. ముద్రగడ పద్మనాభం పురుగుల మందు తాగిగే జరిగే పరిమాణాలకు కాంగ్రెస్ నేత చిరంజీవి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.

రైళ్ళు తగలబెట్టి భయభ్రాంతులకు గురిచేసిన వారిని శిక్షించాలా వద్దా అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఏనాడైనా కాపుల గురించి పట్టించుకున్నారా అంటూ ఎద్దేవా చేసారు. కాపులను బీసీల్లో చేర్చటానికి కనీసం ప్రయత్నమైనా చేసారా అంటూ నిలదీసారు.

narayana-chiru

ముద్రగడను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయటం, ముద్రగడ దీక్ష, అరెస్టు తదితర ఘటనలను ప్రసారం చేయకుండా చెనెళ్ళ ప్రసారాలను నిలుపుదల చేయటం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్టగా చిరంజీవి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కాపు కులస్తులను ఏరోజూ చిరంజీవి పట్టించుకోలేదని నారాయణ విమర్శించారు.

ముద్రగడకు మద్ద తుగా చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. ముద్రగడ అరెస్టును తాను ఖండిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. తునిలో జరిగిన హింసాత్మక ఘటనను ఎవరూ సమర్ధించరని అన్నారు. బాధ్యుల్ని గుర్తించటం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని కూడా చెప్పారు. ఘటనకు మొత్తం బాధ్యులు రాయలసీమ నుండి వచ్చిన వారేనని, గోదావరి జిల్లాల వారు ఎవరూ లేరని చెప్పిన ముఖ్యమంత్రి ఇపుడు అరెస్టులు అవుతున్నవారందరూ ఎవరని చిరంజీవి ప్రశ్నిం చారు.

గోదావరి జిల్లాల వారిని అరెస్టులు చేయటాన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా సమర్దించుకుంటారని నిలదీసారు. సున్నితమైన సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రద ర్శించవలసిన రాజకీయ పరిణతి లేకుండా కక్షగట్టినట్లు వ్యవహరించటం ప్రజాస్వా మ్యంలో తగదంటూ సూచించారు. సమస్యల పరిష్కా రంలో చంద్రబాబు పట్టు విడు పులు ప్రదర్శిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు.

కానీ ముద్రగడ విషయంలో ఎందుకో చంద్రబాబు మొదటి నుండి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ముద్రగడ చేస్తున్న దీక్షకు రాజకీ యాల్ని ఆపాదించి సమస్యను పక్కదారి పట్టించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ముఖ్యమంత్రికే తెలియాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అన్నీ వర్గాల ప్రజల సహాయ సహకారాలను కోరుతున్న ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలని సూచించారు.

కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బిసిలకు చట్టబద్దమైన ఉప ప్రణాళిక అమలు తదితర అంశాలను సానుకూల వైఖరితో పరిష్కరించాల్సిందిగా విజక్షప్తి చేసారు. ముద్రగడపైకి మంత్రులతో, శాసనసభ్యు లతో ఎదురుదాడి చేయించే సంకుచిత విధానాలకు స్వస్తి పలికి విజక్షతతో సమస్య పరిష్కారిం చాలన్నారు. తుని ఘటనపై సిబిఐ ద్వారానే విచారణ జరిపించి నిందితుల్ని చట్టానికి పట్టించాలని చిరంజీవి డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+