కలిసి పని: నారాయణ, మీడియా కూడా: రాధాకృష్ణ

హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కోసం అందరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలతో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నిర్వహించిన సమావేశంలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌కు అవగాహన, మౌలిక వసతులు, చట్టబద్ధత అవసరమన్నారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రచారకర్తలతో కలిసి పని చేస్తామన్నారు.

స్వచ్ఛ భారత్‌లో ప్రజలంతా పాల్గొనాలని అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఏబీఎన్ ‌ -ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అన్నారు. రాధాకృష్ణ సహా 18 మందిని కేంద్రం స్వచ్ఛభారత్‌ ప్రచారకర్తలుగా నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.

Narayana says every one shoud participate in swachh bharat

ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌ కోసం మీడియా తన వంతు బాధ్యతగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి మీడియా ఫ్రీ పబ్లిసిటీ చేయాలని కోరారు. స్వచ్ఛ భారత్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలన్నారు. స్వచ్ఛభారత్‌కు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సహకారం అందిస్తుందని ఎండీ రాధాకృష్ణ చెప్పారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ఏపీ, తెలంగాణ నుంచి వేమూరి రాధాకృష్ణ సహా మొత్తం 18 మందిని నామినేట్‌ చేశారు.

రాధాకృష్ణతో పాటు క్రీడల నుంచి వీవీఎస్ లక్ష్మణ్‌, శివలాల్‌ యాదవ్‌, పుల్లెల గోపీచంద్‌, కోనేరు హంపి, ఐటీ నుంచి మోహన్‌రెడ్డి, చౌదరి, పారిశ్రామికరంగం నుంచి జీవీకే, మైహోం రామేశ్వరరావు, సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్‌, నితిన్‌, అక్కినేని అమల, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఎంపీలు జయదేవ్‌, కవిత, డాక్టర్లు గోపీచంద్‌, జీఎస్‌రావును కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా కేంద్రం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+