దుకాణంపై చిరుకు చెప్పా: నారాయణ, జగన్‌పై ఈటెల
విశాఖపట్నం/ హైదరాబాద్: కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి తన వర్గం నేతలతో సమావేశమవడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రతిస్పందించారు. దుకాణం మూసివేయవద్దని చిరంజీవికి అప్పుడే చెప్పామని, చిరంజీవితో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేల పరిస్థితి గందరగోళంగా తయారైందని అన్నారు.
ఎవరు ఏ పార్టీలో ఉన్నారో వాళ్లకే తెలియడం లేదని నారాయణ ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బిజెపి నేత నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశానికి వినాశమే అన్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. నరేంద్ర మోడీ కన్నా మన్మోహన్ సింగే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అవినీతి కుంభకోణాలకు రాహుల్‌ను వారసుడిగా ప్రకటిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదా అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అడిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 41 మంది శాసనసభ్యుల సంతకాలతో సోనియా గాంధీకి వైయస్ రాజశేఖర రెడ్డి లేఖ ఇవ్వలేదా అని ఆయన అడిగారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ఏ సిద్ధాంతాలను అనుసరించారని ఆయన అన్నారు. అబద్ధాలు, అడ్డదారుల్లోనే వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారా అని ఆయన అన్నారు. తెలంగాణకు మద్దతుగా వైయస్ విజయమ్మ పరకాలలో మొసలి కన్నీరు కార్చిన విషయం నిజం కాదా అని రాజేందర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications