పదేళ్ల తర్వాత జరుగుతోంది: బాబు, కేసీఆర్‌లకు మోడీ షేక్ హ్యాండ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రధాని మోడీ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో అంతర్రాష్ట్ర మండలి సమావేశం రాష్ట్రపతిభవన్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి 17 మంది కేంద్రమంత్రులతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Narendra Modi asks States to focus
Narendra Modi asks States to focus

పది సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో నాలుగు ప్రధాన ఎజెండాలపై చర్చిస్తున్నారు. కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై పుంఛి కమిషన్‌ సిఫారసుల పరిశీలన, ఆధార్‌ను గుర్తింపు కార్డుగా పరిగణించడం ద్వారా సబ్సిడీతో పాటు ఇతర సేవలకు ప్రత్యక్ష నగదు బదిలీ కోసం వాడటంపైనా చర్చిస్తున్నారు.

దీంతో పాటు దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యాప్రమాణాల పెంపుపైనా చర్చిస్తున్నారు. వీటితోపాటు అంతర్గత భద్రతపై సమీక్షిస్తున్నారు. కాగా, ఈ సమావేశానికి ముందు రాష్ట్రపతి భవన్ హాల్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, చంద్రబాబులకు ప్రధాని మోడీ షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించి అభినందించారు.

ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు సయోధ్యతో పనిచేయాలి ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు నిధులు పెంచామని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ పథకాల అమల్లో ఏమైనా సమస్యల ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. భారత్ వంటి పెద్ద దేశంలో చర్చల ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని మాజీ ప్రధాని వాజ్‌పేయి మాటలను గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కిరోసిన వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని ఆయన ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రతి రూపాయి పేదవాడికి అందడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ప్రధాని కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi on Saturday asked States to focus on intelligence sharing which will help the country stay “alert” and “updated” in countering internal security challenges.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి