తెలుగు ప్రజలకు మోడీ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరికీ, భారతి జాతికి శుభం కలగాలని ఆయన కోరుకున్నారు.
తెలుగు ప్రజలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సర పర్వదినాన్ని జరుపుకుంటున్న ప్రజలకు ఆయన ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆశించారు.

కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఉగాది పండుగ జరుపుకున్నారు. తెలుగు ప్రజలందరికీ ఈ పండుగ జయాన్ని చేకూర్చి పెట్టాలని ఆయన ఆశించారు.
ఆశావహులై ఉందాం, ఆశతో జీవిద్దామని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామని ఆయన అన్నారు. ఎవరూ నమ్మకాన్ని కోల్పోవద్దని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి కార్యాలయం ఇందిరా భవన్‌లో ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో చిరంజీవితో పాటు మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, సి. రామచంద్రయ్య పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications