మోదీ ఏడాది పాలన.!చరిత్రగా మారిందా.!కాలగర్బంలో కలిసిపోయిందా.!స్పందించిన పవన్ కళ్యాణ్.!
అమరావతి/హైదరాబాద్ : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది కాలం పూర్తవుతోంది. దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ తీసుకున్న కార్యక్రమాలు, కీలక నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, కాశ్మీర్ అంశం, బాబ్రీ మసీదు, శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశం, త్రిబుల్ తలాక్, సీఏఏ వంటి సాహసోపేత నిర్ణయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాని కంటికి కనిపించని కరోనా వైరస్ కట్టడిలో మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీ ఏడాది పాలన గురించి అనూహ్యంగా స్పందించారు.
ఏడాది పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం.. అభినందించిన జనసేని..
ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి పాలన నేటితో మొదటి సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీపై ప్రసంశల వర్షం కురిపించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ప్రగతి పథంలో నిడిపిస్తున్నాయంటూ అభినందించారు. నరేంద్ర మోడీ ఏడాది పాలన అద్భుతంగా ఉందని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక్క ఏడాదిలోనే ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు గబ్బర్ సింగ్.

మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోంది.. సాహసోపేత నిర్ణయాలు మోదీ సొంతమన్న పవన్..
ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాలతో త్వరలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించిబోతోందని ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ వంటి ధైర్యసాహసాలు, దూరదృష్టి ఉన్న నాయకుడి నేతృత్వంలో 21వ శతాబ్దం భారతదేశానికి సొంతం కానుందని విశ్వాసం వ్యక్తం చేసారు జనసేనాని. దేశానికి దిక్సూచిలా నిలిచే ఉత్తమ నిర్ణయాలతో మోదీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్శిస్తున్నారని, మోదీ పాలనలో పెట్టుబడులకు స్వర్గధామంలో భారత్ ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పవన్ కళ్యాణ అభిప్రాయపడ్డారు.

పవన్ ట్వీట్ పట్ల విమర్శలు.. భజన చేయాల్సిన అవసరం లేదంటున్న విశ్లేషకులు..
2019లో ఎన్నికల్లో 300 కి పైగా సీట్లతో నరేంద్ర మోడీ రెండో సారి అఖండ మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. 2019 మే 23వ తారీఖున ఫలితాలు వెలువడగా 2019 మే 30న రెండవ సారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నేటి శనివారంతో మోదీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంపిన అభినందన ట్వీట్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణానికి రెండు వైపులా చూసి స్పందించాలి గాని, బీజేపి కార్యకర్తగా స్పందించడం ఏంటనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

మోదీ వైఫల్యాలను కూడా చెప్పాలి..మిత్రపక్షంగా ఉన్నంత మాత్రన పొగడ్తలెందుకంటున్న శ్రేణులు..
ఇదిలా ఉండగా పవన్ ట్వీట్ సొంతపార్టీ నేతలనుండే విమర్శలు వస్తున్నట్టు తెలుస్తోంది. మోదీని అభినందించడానికి సందర్బం ఉన్నప్పటికి మరీ నెత్తిన పెట్టుకోవా్సిన అవసరం ఏటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కరోనా క్లిష్ట సమయంలో వలస కూలీల విషయంలో ప్రభుత్వ అసంపూర్ణ విధానాలు తెరమీదకు వచ్చాయని, ఇలాంటి తరుణంలో మోదీని ప్రసంశించడం వల్ల పవన్ కళ్యాణ్ కు నష్టమే తప్ప ఎలాంటి పొలిటికల్ మైలేజ్ రాదంటున్నారు విశ్లేషకులు. కరోనా వైరస్ విషయంలో మోదీ ప్రభుత్వం అంత సమర్ధవంతంగా పని చేయలేదనే చర్చ కూడా జరగుతోంది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల ఎవరికి మేలు జరిగిందో కూడా పవన్ స్పష్టం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?












Click it and Unblock the Notifications