షాక్: కాంగ్రెస్‌లోకి టీ ఎమ్మెల్యే, రాజ్‌తో టచ్‌లో కొణతాల
హైదరాబాద్: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి, ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీలోకి నేతలు క్యూ కడుతున్న సమయంలో స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు తెరాస వైపు చూస్తున్న విషయం తెలిసిందే.
మంగళవారం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రెడ్యా నాయక్, ఆయన కుమార్తె తదితరులు కారు ఎక్కారు. దీంతో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఎమ్మెల్యేలు లేని పరిస్థితి నెలకొంది. అయితే, అనూహ్యంగా.. జిల్లాలోని నర్సంపేట నుంచి కాంగ్రెస్ రెబెల్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడం గమనార్హం.
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో మంగళవారం దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో మాధవ రెడ్డి పేరును తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలగించింది. ఆయన స్థానంలో ఇంకొకరికి అవకాశమిచ్చారు. దీంతో దొంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

నేడు అధికారికంగా బీజేపీలోకి కన్నా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేడు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో కన్నా కమలం కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన కన్నా ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
నరేంద్ర మోడీ చేస్తున్న పనులు నచ్చి తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు నాడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కన్నా చేరిక నేపథ్యంలో ఆయనతో పాటు పలువురు వస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే దారిలో మరికొందరు నేతలు ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, కొణతాల రామకృష్ణ కూడా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో టచ్‌లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.












Click it and Unblock the Notifications