ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో టీడీపీ ఎమ్మెల్యే రచ్చ రచ్చ..!!

టీడీపీ ఎమ్మెల్యే ఎక్సైజ్ కార్యాలయంలో రచ్చ చేసారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్ లో హల్ చల్ చేసారు. డిపోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలిగించాలని డిమాండ్ చేసారు. తన జాబితా మేరకు పోస్టింగ్ ఇవ్వాలని.. ఆ తరువాతే తాను బయటకు వెళ్తానంటూ సోఫాలో బైఠాయించారు. మంత్రి కొల్లు.. పార్టీ చీఫ్ విప్ మాట్లాడినా బేఖాతర్ చేసారు. ఈ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు కూటమి లో కలకలం రేపుతోంది.

ఎమ్మెల్యే రచ్చ
నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్‌ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ చాంబర్ లో రచ్చ రచ్చ చేసారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ విధంగా ఒక శాఖ డైరెక్టర్ ఛాంబర్ కు వెళ్లి వ్యవహరించిన తీరు వివాదంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు మద్యం డిపోలో పని చేస్తున్న ఔట్‌సోరింగ్‌ ఉద్యోగులను వెంటనే మార్చేయాలని డిమాండ్‌ చేశారు. నరసరావుపేటలోని ఎక్సైజ్‌ శాఖకు చెందిన ఐఎంఎల్‌ డిపోలో 11మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విధుల్లో కొనసాగు తున్నారు. వీరువైసీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారనే కారణంతో.. వారిలో ఒకరు మినహా మిగిలిన పదిమందిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Narsaraopet MLA Chadalawada Aravind protest in Excise office leads to new controversy

సోఫాలో పడుకొని
ఇదే అంశం పైన అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలిగించి వారి స్థానాల్లో తాను సూచించిన పదిమందిని తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే పట్టుబట్టరు. ఇప్పటికే ఈ విషయం పై తాను రాసిన లేఖపై స్పందన లేదనే విషయాన్ని డైరెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. తాను చెప్పినవారికి అవకాశం కల్పిస్తేనే చాంబర్‌ నుంచి బయటకు వెళతానంటూ అక్కడే సోఫాలో పడుకుని నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దిక్కుతోచని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌ ఎమ్మెల్యే తీరు పైన ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రకు సమాచారం అందించారు. మంత్రితో పాటు వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు ఫోన్‌లో మాట్లాడి సముదాయించినా చాంబర్‌ నుంచి వెళ్లేందుకు ఎమ్మెల్యే అంగీకరించలేదు.

మంత్రి చెప్పినా
ఆ తరువాత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట డిపో మేనేజర్‌ను ఆదేశిస్తూ డైరెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు దీంతో, అరవిందబాబు అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించడం విమర్శలకు కారణంగా నిలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుతో అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి పెంచేలా వ్యవహరించటం పైన కూటమి నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం పైన ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ బాబు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+