వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కార్ పై జాతీయ ఎస్సీ కమీషన్ సీరియస్ .. వారం రోజుల్లో ఆ నివేదిక పంపాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదు అందిన నేపథ్యంలో దీనిపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ కు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ ఇప్పటివరకు స్పందించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ మరోమారు ఏపీ సర్కార్ కు లేఖ రాసింది. ఈ లేఖలో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ కు చెందిన ఎస్సీ, ఎస్టీ రైట్స్ ఫోరం జాతీయ అధ్యక్షుడు నాగరాజు జాతీయ ఎస్సీ కమిషన్ కు ఏపీలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని, ప్రలోభ పెట్టి క్రిస్టియానిటీలోకి మతాన్ని మారుస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆయన మాత్రమే కాకుండా అనేకమంది ఏపీలో మతమార్పిడుల పై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఈ ఫిర్యాదులపై సమాధానం ఇవ్వాలని గతంలో ఒక లేఖ రాసింది. దీనికి వివరణ ఇస్తూ నివేదిక పంపాలని ఆ లేఖలో కోరింది.

National SC Commission serious on AP Government, asked report on religious conversions

అయితే జాతీయ ఎస్సీ కమిషన్ పంపించిన లేఖకు ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాలేదు. తాము పంపించిన లేఖను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో, సమాధానం ఇవ్వకపోవడంతో ఏపీ సర్కార్ తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక మరోమారు సీరియస్ గా లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్ ఏడు రోజుల్లోగా ఏపీలో జరుగుతున్న మత మార్పిడులకు కారణాలేంటి? ఇప్పటివరకు ఎవరెవరిని మత మార్పిడి చేశారు? మతం పేరుతో పేదలను ఎందుకు ప్రలోభ పెడుతున్నారు? మతం మార్చుకోవడం కోసం ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారు? ఇలా అన్ని వివరాలతో పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాలని ఆదేశించింది.

గతంలో పంపించిన లేఖకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వని కారణంగా, మరోమారు లేఖ పంపిస్తున్నామని, వారం రోజుల్లోగా సమాధానం ఇచ్చి తీరాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ సి ఎస్ కు రాసిన లేఖలో పేర్కొంది. మరి ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారిస్తుందా? జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పాటించి నివేదిక పంపిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
The National SC Commission has expressed outrage over the Andhra Pradesh govt. In the wake of complaints to the National SC Commission that large-scale religious conversions in the AP, it was directed to give an explanation report within a week .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X