నవజీవన్ రైలు దోపిడీ: పోలీసు ఉన్నతాధికారే సూత్రధారి
ప్రకాశం: ఇటీవల (మే 14న) నవజీవన్ రైలు దోపిడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దోపిడీ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓఎస్‌డీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
విచారణ పేరిట నగదు దోపిడీకి యత్నించిన కేసులో పోలీసు ఉన్నతాధికారే ప్రధాన సూత్రధారి అని నిర్థరించారు. ఈ మేరకు సదరు ఉన్నతాధికారిని అదుపులోకి తీసుకుని నెల్లూరు పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
ముగ్గురు స్పెషల్ బ్రాంచి పోలీసులతో నగదు దోపిడి చేయించగా, విచారణ పేరుతో వ్యాపారుల నుంచి రూ.90లక్షలు దోపిడీకి యత్నించినట్లు సమాచారం. సదరు నిందితుడిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీ నమైజాన్ రావు అని తెలిసింది.

కలహాలు: భార్య, కొడుకుల గొంతుకోసి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో భార్య, కుమారుడిని కడతేర్చిన ఓ భర్త.. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బొబ్బిలి మండలం గొర్లెసీతారాంపురంలో వెంకటరమణ అనే ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో తన భార్య, ఇద్దరు కొడుకులపై దాడి చేసి గొంతుకోశాడు.
ఈ ఘటనలో భార్య, ఓ కుమారుడు మరణించారు. మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తండ్రి వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications