మా వల్లే అమరావతి రాజధాని: నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం, త్వరలో నవ తెలంగాణ
విజయవాడ: దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో విడుదల చేశారు.
నీలిరంగు పతాకం, దానిలో ఎర్రని నక్షత్రం గుర్తు గల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు మీడియాతో మాట్లాడాడు. దళిత మహాసభ ఉద్యమం వల్లే నవ్యాంధ్ర ఏర్పడిందన్నాడు. అమరావతిని రాజధాని చేయాలని తాము కోరినందువల్లే వచ్చిందన్నారు. త్వరలో నవ తెలంగాణ పార్టీని ప్రారంభిస్తామన్నాడు.

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
రాజధాని నిర్మాణం నుంచి ఇసుక విధానం వరకు పలు అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో ఈ సమావేశం జరగనుంది.
రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పూర్తయ్యాక జరుగుతున్న తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. రాజధాని నిర్మాణంలో తదుపరి దశలు ఎలా ఉండాలి? ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై చర్చిస్తారు. ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ఏం చేయాలన్న దానిపై గత సమావేశంలోనే చర్చించాల్సి ఉన్నా సమయాభావం వల్ల వాయిదా వేశారు.
ఇసుక అక్రమాలను తీవ్రమైన విషయంగా ముఖ్యమంత్రి భావిస్తుండడంతో ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. రాయలసీమ నుంచి రాజధాని ప్రాంతానికి రహదారుల నిర్మాణంపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వస్తాయని సమాచారం.












Click it and Unblock the Notifications