చంద్రులకు నవీన్ పట్నాయక్ హ్యాండ్ : మేము వారితో కలవం : బిజెడి నిర్ణయం ఏంటంటే..
జాతీయ రాజకీయాల్లో కూటములు..ఎవరికి మద్దతిచ్చే అంశం పై బిజెపి అధినేత..ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టత ఇచ్చేసారు. కొద్ది రోజుల క్రితం బిజెపి ఎంపి ఏపి ముఖ్యమంత్రిని కలిసారు. చంద్రబాబు ఆలోచనలకు మద్దతు ప్ర కటించారని టిడిపి నేతలు చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేస్తన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా బిజెడి చంద్రబాబు కు దగ్గర అవు తోందని విశ్లేషణలు జరిగాయి. అయితే, తాజాగా నవీన్ పట్నాయక్ ప్రకటనతో వారి వైఖరి స్పష్టమైంది.
ఆ రెండు కూటముల్లో చేరము...
జాతీయ స్థాయిలో కాంగ్రెస్- బిజెపి మద్దతు కూటమలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు పార్టీలతో సంబంధం లేకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ - బిజెపీతర ఫ్రంట్ గా ఏర్పడుదామని..కలిసి రావాల ని పిలుపునిచ్చారు. అయితే, నవీన్ పట్నాయక్ తన ఆలోచన బయట పెట్టలేదు. ఆ వెంటనే బిజెడి ఎంపి అమరావతి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. చంద్రబాబు ఆలోచనలను అభినందించారు. దీంతో..ఒడిశా ముఖ్య మంత్రి దూతగా ఆయన వచ్చారని..ఒక బిజూ జనతా దళ్ సైతం కాంగ్రెస్ మద్దతు కూటమిలో చేరుతుందని పలువు రు అంచనా వేసారు. టిడిపి నేతలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు.

తన స్టాండ్ స్పష్టం చేసిన నవీన్ పట్నాయక్
జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయతలపెట్టిన మహా కూటమిలో చేరే ఆలోచన లేదని బిజు జనతా దళ్ అధినేత,ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.కాంగ్రెస్ ఆద్వర్యంలోని యుపిఎలోకాని, బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ. లో కాని చేరబోమని ఆయన చెప్పారు. దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఇదే సమయంలో ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతారా లేదా అనే అంశం పై మాత్రం స్ప ష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ - బిజెపి కూటములకు మద్దతు లేదని చెప్పటం ద్వారా మరి..ఆయన తటస్థ వైఖరితోనే ఉంటారా..లేక కేసీఆర్ కూటమికి మద్దతు ప్రకటిస్తారా అనేది చూడాల్సి ఉంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications