పెళ్లికి నయనతార తెలుగోళ్లను ఒక్కరిని కూడా పిలవలేదేంటి?
నయనతార-విఘ్నేశ్ శివన్ ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ జంట చిరకాలం చిలకా గోరింకల్లా వర్ధిల్లాలని వివాహానికి హాజరైన అతిథులంతా దీవించారు. విచిత్రమేమిటంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఒక్క తెలుగువారు కూడా ఆమె వివాహానికి హాజరుకాలేదు. నయనతార పిలవలేదా? పిలిచినా మనవారు వెళ్లలేదా? అంటే ఆ విషయం నయనతారకే తెలియాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే మొదటినుంచి నయనతారకు చిన్నచూపేనని, తెలుగు పరిశ్రమ నుంచి ఎవరినీ ఆహ్వానించలేదంటే.. అదేం కాదని, చెన్నైలో జరిగే రిసెప్షన్‌కు అందరినీ ఆహ్వానించామని ఆమె సన్నిహితులు తెలిపారు.
తమిళ చిత్రసీమ నుంచి రజనీకాంత్ హాజరయ్యారు.. హిందీ చిత్రపరిశ్రమ నుంచి షారుక్‌ఖాన్ హాజరయ్యారు. కనీసం తెలుగు నుంచి ఆమెతో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్న సమంతైనా హాజరవుతుందనుకున్నారు. కానీ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపి ఊరుకుంది. ఎంతైనా నయనతారకు టాలీవుడ్ అంటే చిన్నచూపేనని వస్తున్న విమర్శలను ఆమె టీమ్ తిప్పికొడుతోంది.

టాలీవుడ్ లో గతం నుంచి ఇప్పటివరకు ఎన్నో క్రేజీ ఆఫర్లు వచ్చినా నయతనతార వద్దనుకుంది. ఎక్కువ ప్రాధాన్యం అనేకన్నా తన ప్రాధాన్యత మొత్తం తమిళ చిత్రసీమకే ఇచ్చింది. అసలు తెలుగు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఏది ఏమైనా ప్రేమ విషయంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా చివరకు విఘ్నేశ్ శివన్‌తో తన వివాహం జరగడం అందరినీ సంతోషపరిచింది. తాను ఆమెను మేడమ్ అనేవాడినని, ఇప్పుడు తన భార్య అయిందని విఘ్నేశ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications