'ఓయు' వెనుక ఎవరు: నాయిని, సానియా చూపించిందా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన తప్పేమిటని ఉస్మానియా విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి బుధవారం ప్రశ్నించారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను ఓయు విద్యార్థులు ఎందుకు తగులబెడుతున్నారని ప్రశ్నించారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ఉపక్రమించడం ఆయన చేసిన నేరమా అన్నారు.
దీని వెనకాల కేంద్ర ప్రభుత్వం ఉందా? లేక కేంద్ర పార్టీ నాయకులు ఎవరున్నారో విజ్ఞులు ఆలోచించాలని నాయిని అన్నారు. మంచి పనులకు అడ్డుపడుతుంటే కార్మిక సంఘాలు, కమ్యూనిస్టులు, విప్లవకారులు ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు. మీకు అన్యాయం జరుగుతుందని భావిస్తే ముఖ్యమంత్రిని కలవాలని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు.
సానియా ఆధారాలు చూపించిందా?

విద్యార్థుల చదువును కూడా రాజకీయకోణంలో చూసి. 1956కు ముందు నుండి తెలంగాణలో ఉంటున్న వారికే ఫీజు రీయింబర్సుమెంట్స్ ఉంటుందని చెప్పే కేసీఆర్‌కు.. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా విషయంలో అది గుర్తుకు రాలేదా అని తెలుగు యువత ప్రశ్నించింది. సానియా తాతముత్తాతలు, ఎక్కడ పుట్టారో, ఆమె తండ్రి ఎక్కడి నుండి వచ్చారో ఆధారాలు చూపించారా అని నిలదీశారు.
ఆమె తండ్రి మహారాష్ట్రలో పుట్టారని, ఆమె భర్త పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి అని, అటువంటి వారికి రూ.కోటి చెల్లించి.. ఇక్కటే పుట్టి పెరిగిన పిల్లలకు మాత్రం ఫీజులు చెల్లించవా అని మండిపడ్డారు. తెలుగు మాట్లాడటం రాని, ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు, నాగరికత తెలియని ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా నియమిస్తాన్నారు. ఎవరెస్టు అధిరోహించిన తెలుగు బిడ్డలు పూర్ణ, ఆనంద్‌లు పనికి రారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications