జగన్ సంచలన లేఖ

YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తోన్నారు.

ఢిల్లీ ఆందోళన సక్సెస్‌తో..

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న హత్యలు, అత్యాచారాలు, దాడులపై దేశ రాజధానిలో చేపట్టిన ఆందోళన విజయవంతమైన జోష్‌లో ఉన్నారు జగన్. ఇదే ఊపులో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అంశాలవారీగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

NDA govt mislead the Governor and misuse the Constitutional authority says YS Jagan

గవర్నర్‌కు లేఖ..

తాజాగా అవే అంశాలతో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. ఏడు పేజీల సుదీర్ఘ లేఖ ఇది. ఈ నెల 22వ తేదీన అసెంబ్లీ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో అనేక వక్రీకరణలు ఉన్నాయని పేర్కొన్నారు. అవేంటో ఈ లేఖలో విశదీకరించారు జగన్. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మొదలుకుని పోలవరం ప్రాజెక్టు, చేసిన అప్పుల వరకు అన్నింటినీ వివరంగా పొందుపరిచారు.

పోలవరంపై..

2014- 2029 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయినట్లు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారని, వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని జగన్ అన్నారు. ఆ కాలంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టింది 11,923 కోట్ల రూపాయలేనని చెప్పారు.

రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులో..

కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయాన్ని 55,548.87 కోట్ల రూపాయలుగా పేర్కొందని, 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం 11,923 కోట్ల రూపాయలే ఖర్చు చేస్తే 72 శాతం పనులు ఎలా పూర్తవుతాయని జగన్ ప్రశ్నించారు.

మౌలిక సదుపాయాల కల్పనపై..

తమ ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి ఖర్చూ చేయలేదని గవర్నర్ ప్రసంగంలో ఉందని, ఇది కూడా అవాస్తవమేనని జగన్ చెప్పారు. 2019 ఆగస్టు నాటికి రాష్ట్రంలో 30,74,310 ఇళ్లకు మాత్రమే మంచినీటి కుళాయిల కనెక్షన్లు ఉండగా.. తమ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్యను 70,11,885కు చేర్చామని అన్నారు. 2024 జూన్ వరకు ఈ సంఖ్య ఎలా పెరిగిందో కనీసం టీడీపీ అయినా చెప్పగలుగుతుందా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర రుణాలు ఇలా..

2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి రాష్ట్రం అప్పులు 1,18,051 కోట్ల రూపాయలు ఉండగా.. 2019లో టీడపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 130 శాతం పెరిగి.. ఈ సంఖ్య 2,71,798 కోట్ల రూపాయలకు చేరిందని వివరించారు. 2024 నాటికి రాష్ట్రం అప్పులు 5,18,708 కోట్ల రూపాయలకు చేరిందని, ఈ సంఖ్య 90 శాతం పెరిగిందని చెప్పారు. దీనికి భిన్నమైన అంకెలు గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయని అన్నారు.

పీఎస్‌యూల సీఏజీఆర్..

2014-2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వరంగ కంపెనీల అప్పులు, గ్యారంటీల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 21.63 శాతం ఉండగా.. తమ ప్రభుత్వ హయాంలో దీన్ని 12.90 శాతానికే పరిమితం చేశామని జగన్ పేర్కొన్నారు. దీనిపైనా తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+