బయటపడగానే అందరి పేర్లు చెప్తా, తిండి పెట్టా: నీతూ
కర్నూలు: మస్తాన్ వలీ నుండి తనకు ప్రాణహానీ ఉందని, తనకు బెదిరింపులు వస్తున్నాయని ప్రముఖ నటీ నీతూ అగర్వాల్ ఆరోపించారు. తనను బెదిరించిన వారి పేర్లు త్వరలో బయటపెడతానని చెప్పారు. తనకు బెయిల్ రావొద్దని కొందరు ప్రయత్నించారని ఆరోపించారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు నుండి తాను బయటపడగానే ఎవరెవరు తనను బెదిరించారో ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. సినీ నటిగా డబ్బులు సంపాదించి తాను మస్తాన్ వలీకి తిండి పెట్టేదానిని అని చెప్పారు. తనను హింసించేవాడని, తన ఒంటి పైన గాయాలు కూడా ఉన్నాయన్నారు.

తనకు ప్రాణహానీ ఉందని, తనకు ప్రభుత్వం సెక్యూరిటీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త మస్తాన్ వలీ ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడని తనకు తెలియదని చెప్పారు. తనకు ఏం జరిగినా మస్తాన్ వలీదే బాధ్యత అన్నారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలన్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పారు. తనకు ఎవరి నుండి మద్దతు లభించడం లేదన్నారు. మస్తాన్ వలీ తన భర్తే కదా అని నమ్మి ఏటీఎం కార్డులు ఇవ్వడంతో తాను నిందితురాలిగా నిలవాల్సి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications