వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లో అవుట్స్: కోనసీమ గుండెలపై ఆరని చిచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పచ్చటి పొలాలతో, కొబ్బరి తోటలతో, అరటి తోటలతో విలసిల్లే కోనసీమలో గ్యాస్ పైపులైన్లు అరని చిచ్చుగా మారాయి. పదే పదే ఈ ప్రాంతంలో ప్రమాదాలు సంభవిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదు. తాత్కాలిక ఉపశమనాలకు పాల్పుడతున్నారనే తప్ప ప్రమాదాలను నివారించడానికి నిర్దిష్టమైన, పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు.

ఇటీవల కొన్నిసార్లు గ్యాస్ పైపులైన్ లీకేజీ అయింది. అయితే, దాన్ని పట్టించుకోకపోవడంతో తాజాగా నగరం గ్రామం వద్ద ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఎన్ఎఫ్‌సిఎల్, జిఎఫ్‌సిఎల్, ల్యాంకోలాంటి పరిశ్రమలకు గ్యాస్‌ను సరఫరా చేయడానికి గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకు పైపులైన్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.

Negligence: Blow outs in Konaseema

లీకేజీల నేపథ్యంలో పైపులైన్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించక మరమ్మతులు చేసి వదిలేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుత ప్రమాదంలో ఒక ఇంట్లోని ముగ్గురు సజీవ దహనమయ్యారు. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. ఏం జరిగిందో తెలిసే లోపలే జరగాల్సిందంతా జరిగిపోయింది.

1993లో మామిడికుదురు మండలం కొమరాడలో తొలిసారి బ్లో అవుట్ సంభవించింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బ్లో అవుట్ పాశర్లపూడి 19 స్ట్రక్చర్ పరిధిలో 1995లో అల్లవరం మండలం దేవర్లంకలో జరిగింది. ఈ బ్లో అవుట్ 65 రోజుల పాటు మండింది. చివరకు విదేశీ నిపుణుల సహకారంతో అదుపులోకి వచ్చింది.

1997లో రావులపాలెం మండలం దేవరపల్లిలో బ్లో అవుట్ సంభవించి, దానంతటదే ఆరిపోయింది. 2005 సెప్టెంబర్‌లో పాశర్లపూడి స్ట్రక్చర్‌లోని తాండవపల్లిలో మమరోసారి బ్లో అవుట్ సంభవించింది.

English summary
Blow outs in Konaseema became a regular practice in Konaseema, as the concerned authorities not taking correct measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X