జగన్ నెల్లూరు టూర్ వేళ వైసీపీ కీలక నేతకు పోలీసుల షాక్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఏడాది పాటు మౌనంగానే ఉన్న జగన్ తాజాగా స్పీడు పెంచారు. ఈ నేపథ్యంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దాడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలతో పాటు రైతులు, ఇతర వర్గాలను పరామర్శించేందుకు జగన్ చేపడుతున్న యాత్రలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
ఈ నేపథ్యంలో జగన్ టూర్ అనగానే పోలీసులు ఆంక్షలతో సిద్దమైపోతున్నారు. జగన్ టూర్ కు అనుమతి కోరగానే ఆంక్షల చిట్టా వైసీపీ నేతల చేతిలో పెట్టేస్తున్నారు. ఇదే క్రమంలో రేపు నెల్లూరుకు వెళ్లి జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ లో పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతుండగా.. ఈ టూర్ కు హెలిప్యాడ్ వద్దకు 10 మందే రావాలని పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే కీలక నేతలకు నోటీసులు ఇచ్చి కట్టడి చెసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదే క్రమంలో ఇవాళ నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఏ2గా ఉన్న అనిల్ యాదవ్ ను ఆగస్టు 4న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఇప్పటికే ఓసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా అనిల్ యాదవ్ హాజరు కాలేదు. దీంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.

ఆగస్టు 4న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంలో తప్పులేకపోయినా పోలీసులు వాటిని ఇచ్చిన సమయం ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే రేపు జగన్ టూర్ కు ఏర్పాట్లలో బిజీగా ఉన్న అనిల్ యాదవ్ ను కట్టడి చేసేందుకే పోలీసులు ఇలా ఇంటికొచ్చి నోటీసులు ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే జగన్ టూర్ కు బారీగా జన సమీకరణ చేయకుండా నెల్లూరుకు వచ్చే అన్ని దారుల్లో చెక్ పోస్టులు పెట్టినట్లు వైసీపీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications