రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ దుష్ప్రచారం - ఎమ్మెల్యే కోటంరెడ్డి
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి, సోదరులు వచ్చినప్పుడు సిఫారసు లేఖ ఇచ్చానని, అయితే అధికారుల పరిశీలన తరువాత జులై 30న మాత్రమే పెరోల్ మంజూరు చేసినట్లు వివరించారు.
సిఫారసు లేఖలు సాధారణం..
శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పలు సమస్యల కోసం ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు. అధికారులు వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. జులై 16న నా లేఖ తిరస్కరించబడింది, 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేయడం జరిగింది. ఇది అధికారుల ప్రామాణిక ప్రక్రియలో జరిగింది" అని అన్నారు.

వైసీపీపై ఫైర్..
వైసీపీ నేతలు పెరోల్ విషయంలో రాజకీయ ప్రాసెస్‌ను తప్పుగా చూపిస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యలే శ్రీకాంత్‌కు లేఖలు ఇచ్చి పెరోల్ పొందించారని గుర్తు చేశారు. ఇంక తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవరికీ పెరోల్ సిఫారసు లేఖ ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రతి రాజకీయ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలని తెలిపారు.
తన రాజకీయ దృష్టి ఎప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంపై ఉంటుందని.. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే విధానం ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. అలానే దందాలు చేసి ఉంటే అధికారానికి 18 నెలల ముందే నాటి ముఖ్యమంత్రి జగన్ ని విభేదించి బయటకు వచ్చానని.. కానీ తన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ సమయంలో తనను, తన కుటుంబ సభ్యులని ఎలా వేదించారో గుర్తు చేసుకోవాలన్నారు. తమను వేధించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కలు చూపించేవాడినని కానీ అలా చేయనని చెప్పారు.
2004 నుంచి 2014 మధ్యలో రూరల్ లో అప్పటి అధికార పార్టీ ఇంచార్జ్ గా.. ఇప్పటి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న వ్యక్తి హయాంలో హత్యలు, ఇసుక, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడుదామా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ లో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా వేధించామా అన్నారు. రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన సూచన చేశారన్నారు. కార్యకర్త భుజంపై చెయ్యి వేసి నవ్వితే సరిపోదని.. వారి పరిస్థితి తెలుసుకోవాలని, అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications