Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భూకంపం: నేపాల్లో ఏపీ, తెలంగాణవాసులు క్షేమం (పిక్చర్స్)

హైదరాబాద్: నేపాల్ భూకంపం నేపథ్యంలో ఖాట్మాండులో చిక్కుకున్న తెలుగు వారి కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తీసుకు వచ్చేందుకు ఇరు ప్రభుత్వాలు సమీక్షిస్తున్నాయి. ఇందుకోసం కంట్రోల్ రూంలను ప్రారంభించాయి. తెలుగు రాష్ట్రాలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో, సచివాలయాలలో కంట్రోల్ రూంలను ప్రారంభించాయి.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హైదరాబాదు నుండి పలువురు నేపాల్ వెళ్లారు. ఏపీ నుండి వెళ్లిన 131 మంది ఖాట్మాండులో చిక్కుకున్నారు. వారంతా క్షేమంగానే ఉన్నారు. ఓ మహిళకు మాత్రం గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

యాత్రకు వెళ్లిన వినాయకనగర్ శ్రీనివాస్ ఇల్లు

యాత్రకు వెళ్లిన వినాయకనగర్ శ్రీనివాస్ ఇల్లు

నేపాల్లో భూకంపం వార్త వినగానే ముక్తినాథ్ యాత్రకు వెళ్లిన భాగ్యనగరవాసుల బంధువుల్లో ఆందోళన కనిపించింది.

యాత్రకు వెళ్లిన శ్రీనివాస్, లలిత

యాత్రకు వెళ్లిన శ్రీనివాస్, లలిత

హైదరాబాద్ నుండి పలువురు పర్యాటకులు ముక్తినాథ్, పశుపతినాథ్ యాత్ర కోసం నేపాల్లోని ఖాట్మాండ్ వెళ్లారు. తెలుగు పర్యాటకులు అదృష్టవశాత్తు తప్పించుకున్నారు.

 భూకంపం: నేపాల్లో ఏపీ, తెలంగాణవాసులు క్షేమం (పిక్చర్స్)

భూకంపం: నేపాల్లో ఏపీ, తెలంగాణవాసులు క్షేమం (పిక్చర్స్)

నేపాల్లో భూకంపం వార్త వినగానే ముక్తినాథ్ యాత్రకు వెళ్లిన భాగ్యనగరవాసుల బంధువుల్లో ఆందోళన కనిపించింది.

ఖాట్మాండ్

ఖాట్మాండ్

మల్కాజిగిరికి చెందిన గౌరీశంకర్, ఈ నెల 15వ తేదీన వాసవీనగర్‌కు చెందిన 19మందిని, ఆర్టీసీ కాలనీకి చెందిన నలుగురిని, లాల్ బజార్‌కు చెందిన ముగ్గురిని, ఈసీఎఐఎల్‌కు చెందిన ఒకర్ని తీసుకొని యాత్రకు వెళ్లారు.

ఖాట్మాండ్

ఖాట్మాండ్

తెలుగు ప్రయాణీకులు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, భూకంపంతో రవాణామార్గాలన్ని మూసుకుపోయాయి. రోడ్డు మార్గం బాగుంటే ఆదివారం ఉదయం ఏదైనా ప్రయివేటు వాహనంలో కాశీకి, అక్కడ్నుండి హైదరాబాద్ వస్తారు.

ఖాట్మాండ్

ఖాట్మాండ్

నేపాల్లో చిక్కుకున్న ఏపీ, తెలంగాణ వాసులను తీసుకు వచ్చేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

ఖాట్మాండ్

ఖాట్మాండ్

నేపాల్లో భూకంపం వార్త వినగానే ముక్తినాథ్ యాత్రకు వెళ్లిన భాగ్యనగరవాసుల బంధువుల్లో ఆందోళన కనిపించింది.

ఖాట్మాండ్

ఖాట్మాండ్

నేపాల్‌లో ఆలయాల దర్శనానికి వెళ్లిన హైదరాబాదుకులోని ఉప్పల్‌కు చెందిన మహిళల దృశ్యం.

ఖాట్మాండ్

ఖాట్మాండ్

హైదరాబాదులోని కార్ఖాన న్యూవాసవీ నగర్‌కు చెందిన నాగేశ్వర రావు, సరళ దంపతులతో పాటు పలువురు ఖాట్మాండ్ వెళ్లారు.

ఖాట్మాండ్

ఖాట్మాండ్

నాగేశ్వర రావు, సరళతో పాటు అండాలు, బాలనాగమ్మ, ప్రకాశ్ తదితరులు నాలుగు రోజుల క్రితం నేపాల్ వెళ్లారు. వారంతా క్షేమంగా ఉన్నారు.

మరోవైపు, భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 2వేల మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. భారత్ మూడు ప్రత్యేక విమానాల్లో 500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చింది. మరో పది విమానాలను నేపాల్‌‍కు పంపించనుంది. వీటిలో, సహాయక సిబ్బంది, వస్తు సామాగ్రి, ఆహార పదార్థాలు ఉంటాయి. ఆపరేషన్ మైత్రి పేరిట ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంటోంది.

నేపాల్‌లో భారత్ బాలికల ఫుట్‌బాల్ అండర్ 14 జట్టు చిక్కుకుంది. మూడవ స్థానం కోసం ఇరాన్‌తో మ్యాచ్ భారత జట్టు ఆడటం కోసం ఉంది. ఈ నేపథ్యంలో వారి విడిది ప్రాంతంలో భూకంపం వచ్చింది. మళ్లీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో ఆ బాలికలు బస చేస్తున్న హోటల్ వెలుపలే నిద్రించారు. కాగా, ఆదివారం వేకువ జామున 3, 5, 6 గంటలకు ఖాట్మాండులో ప్రకంపనలు వచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+