కొత్త రాజధాని: 14న సీమాంధ్రలో కమిటీ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కమిటీ తొలిసారి రాష్ట్రంలో పర్యటించనుంది. శివరామకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ మే 14న రాష్ట్రంలో పర్యటించనుంది. రాజధాని ఎంపిక కమిటీ తొలి దశలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో పర్యటించనుంది.
రెండో దశలో ఒంగోలు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తుంది. ఈ ప్రాంతాల్లో అధ్యయనం నిర్వహించిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అధ్యయనం కమిటీ ప్రతిపాదన ఎలా వున్నా.. సీమాంధ్రలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానిదే తుది నిర్ణయం అయ్యే అవకాశం ఉంది.

ఎంపిక కమిటీ అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతం రాష్ట్రంలోని మిగితా ప్రాంతాలకు దగ్గరగా ఉండే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తాగునీరుకు సమస్యలేని ప్రాంతాన్ని, భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదించే అవకాశం ఉంది.
మావోయిస్టుల ప్రాబల్యం, సముద్రతీరం లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. రాజధాని ఎంపిక విషయంలో ప్రజలు, పలు సంఘాల అభిప్రాయాలను కూడా ఎంపిక కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications