ఇండియన్ హైస్పీడ్ రైలు వచ్చింది తెలుసా?
కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో రైల్వేలను అభివృద్ధి చేయడంపైనే భారత ప్రభుత్వం దృష్టిసారించింది. వందేభారత్, అమృత్ భారత్.. ఇలా రకరకాల పేర్లతో అత్యాధునిక సౌకర్యాలున్న రైళ్లను ప్రయాణికులకు పరిచయం చేస్తోంది. బుల్లెట్ రైళ్లు నడపడానికి ముందుగా సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపిస్తోంది. ఇప్పటికే సరకు రవాణా చేస్తున్న గూడ్స్ రైళ్ల వేగం కూడా పెరిగింది. ప్రయాణికుల సూపర్ ఫాస్ట్ రైళ్ల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉంది. దీన్ని 130 కిలోమీటర్లకు పెంచబోతున్నారు. అలాగే తేజస్ రాజధాని రైళ్ల వేగం గంటకు 140 కిలోమీటర్లుగా ఉంది.
న్యూఢిల్లీ నుంచి బయలుదేరి విమానవేగంతో దూసుకుపోయే తేజాస్ రైలు ముంబయి వరకు నడుస్తుంది. వేగంతోపాటు సకల సౌకర్యాలకు ఈ రైలు నిలయం. ఇందులో క్యాటరింగ్ సౌకర్యం అద్భుతంగా ఉంటుంది. ముంబయి నుంచి ఢిల్లీకి ప్రయాణించే 1400 కిలోమీటర్ల దూరంలో కేవలం ఆరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. స్టేషన్ నుంచి బయలుదేరి వెంటనే జెట్ స్పీడ్ అందుకుంటుంది. న్యూఢిల్లీ నుంచి సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరిన తర్వాత రాజస్తాన్ లోని కోటా వద్దే ఆగుతుంది.

ఆటోమేటిక్ డోర్లుంటాయి. ఏసీతోపాటు వైఫై, ఎల్ సీడీ స్క్రీన్లతోపాటు ఎగ్జిక్యూటివ్, చైర్ క్లాస్ లో స్నాక్స్ టేబుల్స్, మ్యాగజైన్లు, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు వంటి సౌకర్యాలుంటాయి. సీసీ కెమెరాలు, హ్యాండ్ డ్రయ్యర్లు, నీటి స్థాయి సూచికలు, టచ్‌లెస్ వాటర్ ట్యాప్‌లు.. ఇలా ఎన్నో అధునాతన ఫీచర్లు ఈ రైలు సొంతం. భవిష్యత్తులో అన్ని రైళ్లల్లో కూడా ఈ తరహా అధునాతన సౌకర్యాలను కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వందేభారత్ లాంటి ఏసీ రైలు, అమృత్ భారత్ లాంటి నాన్ ఏసీ రైళ్లల్లోకూడా అత్యాధునిక సౌకర్యాలున్నాయని, భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications