జగన్ కన్నుసన్నల్లో బ్రదర్ అనిల్ ఎంట్రీ ? విపక్షాలకు షాకిచ్చేలా ప్లాన్ ! సైలెన్స్ తో కొత్త డౌట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ప్రధాన విపక్షం టీడీపీతో పాటు ఇతర విపక్ష పార్టీలు జనసేన, బీజేపీ కూడా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్ధితులు లేవు. అలాగని ప్రజా వ్యతిరేకత లేదని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో సీఎం జగన్ ఇప్పుడు తన బావ బ్రదర్ అనిల్ తో పార్టీ పెట్టించడం ద్వారా విపక్షంలోని రాజకీయ శూన్యతను భర్తీ చేయడంతో పాటు తనకు అసలు విపక్షాల నుంచి పోటీ లేకుండా చూసుకుంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.

బ్రదర్ అనిల్ ఎంట్రీ
ఇన్నాళ్లూ ఏపీలో బలమైన రాజకీయ కుటుంబానికి అల్లుడైనా మత ప్రబోధకుడిగానే ఉంటూ మద్దతిచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు తపనపడుతున్నారు. అదీ 2019లో తాను వైసీపీకి ఎలా మద్దతు ఇప్పించానో జనాలకు గుర్తుచేస్తూ మరీ తన మద్దతుదారులకు గుర్తుచేస్తున్నారు. గతంలో వైసీపీకి మద్దతిచ్చిన వారంతా ఇప్పుడు తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తిగా ఉన్నారంటూ బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. దీంతో బ్రదర్ అనిల్ ఇప్పుడు వీరందరినీ కలుపుకుని కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అసలే అసలు ట్విస్ట్ ఎదురవుతోంది.

బ్రదర్ ఎంట్రీపై వైసీపీ మౌనం
సాధారణంగా అయితే వైసీపీకి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెరవెనుక బలంగా మద్దతిచ్చి, ఇప్పించి పార్టీ 151 స్ధానాలతో అధికారంలోకి రావడానికి ప్రయత్నించిన వ్యక్తి.. సీఎం బావ అయినా సరే ఇప్పుడు తన మద్దతుదారులతో భేటీలు పెట్టి తమపై విమర్శలు ఎక్కుపెడుతుంటే ఏం చేయాలి ?. కనీసం వ్యక్తిగత స్ధాయిలో అయినా దానికి కౌంటర్ ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా అలా జరగడం లేదు. దానికి బదులుగా రాష్ట్రంలో క్రైస్తవసంఘాలు రంగంలోకి దిగి ఆయన్ను కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు సైతం స్పందించిన వైసీపీ పెద్దలు సజ్జల వంటి వారు సైతం ఇప్పుడు బ్రదర్ అనిల్ గురించే మాట్లాడటం లేదు. దీంతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి.

జగన్ కన్నుసన్నల్లోనేనా ?
బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఇప్పటికే విజయవాడ, విశాఖలోని తన మద్దతుదారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయినా వైసీపీ వైపు నుంచి కానీ, సీఎం జగన్ నుంచి కానీ పల్లెత్తు మాట వినిపించడం లేదు. గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు సైతం సీఎం జగన్ మాట్లాడలేదు. ఆ తర్వాత పదే పదే అడుగుతుంటే పార్టీ పెద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ముక్తసరిగా స్పందించారు. అదీ తెలంగాణ వ్యవహారాలతో మాకు సంబంధం లేదని మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు. నేరుగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికే సవాల్ విసురుతూ కొత్త పార్టీకి బ్రదర్ అనిల్ సిద్ధమవుతున్నారు. అయినా కనీస స్పందన లేకపోవడంతో ఇదంతా జగన్ కన్నుసన్నల్లోనే జరుగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

విపక్షాలను తప్పించే వ్యూహం !
ఏపీలో ప్రస్తుతం అధికారపక్షం వైసీపీ బలంగా ఉంది. అయినా ప్రజా వ్యతిరేకత ఉంది.కానీ దాన్ని సొమ్ము చేసుకునే పరిస్ధితుల్లో విపక్షాలు లేవు. అయితే ఇదంతా ఎప్పటివరకూ అంటే ఎవరికీ తెలియదు. ఏదో ఒక రోజు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకులంతా కూడబలుక్కోవడం ఖాయం. సీఎం జగన్ ను టార్గెట్ చేయడం ఖాయం. దానికి బదులుగా ప్రజలకు తానే ఓ విపక్షాన్ని అందుబాటులో ఉంచి మద్దతిచ్చేలా చేసుకుని, ఆ తర్వాత తన పార్టీలో కలిపేసుకుంటే ఇక ఆ ఇబ్బంది కూడా ఉండదు. సరిగ్గా ఇదే వ్యూహంతో బ్రదర్ అనిల్ ను జగన్ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంత ఉందన్న అంశం కాస్త పక్కనబెడితే విపక్షాల్ని తప్పించి బ్రదర్ అనిల్ రూపంలో తనకు నచ్చిన విపక్షాన్ని సైతం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కచ్చితంగా విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలను కలవరపెడుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications