వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవనం, సదుపాయాలు కల్పిస్తే ఏపిలో హైకోర్టు: సదానంద

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నెలకొల్పడానికి చర్యలు చేపడతామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వినోద్‌కుమార్‌, జితేందర్‌ రెడ్డి, తెలుగుదేశం ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్రమంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Sadananda Gowda

విభజన చట్టం ప్రకారం ఏపీలో కొత్తగా హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అప్పటివరకూ హైదరాబాద్‌లో ఉన్నది ఉమ్మడి హైకోర్టు అవుతుందన్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు కాగానే, ఇది తెలంగాణ హైకోర్టు అవుతుందని తెలిపారు.

ఏపీ హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, ఇతర సౌకర్యాలు సమకూరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లయితే కేంద్రం వెంటనే తగిన నోటిఫికేషన్‌ను జారీ చేసి హైకోర్టు విభజన ప్రక్రియను ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి, ఉమ్మడి హైకోర్టు నుంచి వివరాలు ఇంకా అందలేదని పరోక్షంగా ప్రస్తావించారు.

English summary
Union Minister Sadananda Gowda on Thursday said that new high court building is Andhra Pradesh government's charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X