ఏపీలో ఉచిత బస్సుకు కొత్త సమస్యలు..! ఆర్టీసీ ఎండీకి ఉద్యోగుల లేఖ...!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఎంతో కసరత్తు చేసిన ప్రభుత్వం.. తాజాగా ఇది విజయవంతమైనట్లు కూడా ప్రకటించుకుంది. అయితే క్షేత్రస్దాయిలో మాత్రం పరిస్ధితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉచిత బస్సు పథకం అమలు సందర్భంగా పలు చోట్ల ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులపై ఎంప్లాయీస్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, జి.వి. నరసయ్య ఆర్టీసి ఎంపీకి లేఖ రాశారు. స్త్రీశక్తి పథకం విజయానికి ఆర్టీసీ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని, ఓవర్ లోడ్సు తో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారని నేతలు గుర్తుచేశారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో రద్దీ తీవ్రంగా ఉందన్నారు.

తాగుబోతులు, అల్లరి మూకలు సిబ్బందిపై దాడులు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాడులపై ప్రభుత్వ పెద్దలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. బస్సులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం ప్రకటించాలన్నారు.
బస్సుల్లోను,బస్టాండ్‌లలో ఈ మేరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. స్త్రీశక్తి బస్సులు కేవలం బస్‌స్టాప్‌లలోనే ఆగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణీకులు టిక్కెట్ చెల్లింపులకు సరిపడా చిల్లర తెచ్చుకోవాలని వారు కోరారు.
ఉచిత ప్రయాణికులు ఆధార్ కార్డు రెడీగా పట్టుకొని చూపాలని లేఖలో కోరారు.

స్త్రీశక్తి పథకం సమర్థవంతంగా నడవాలంటే కొత్త బస్సులు, సిబ్బంది నియామకాలు అవసరమని తెలిపారు. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈయూ డిమాండ్ చేసింది. ఉద్యోగులు ప్రజల సౌకర్యం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, కాబట్టి సిబ్బందిని రక్షించడం సంస్థ, ప్రభుత్వ బాధ్యతని గుర్తుచేసింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications