వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక మాఫియాకు చెక్... కఠిన చట్టాలు తెేవాలని సీఎం జగన్ ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇసుక ధరల నియంత్రణతోపాటు అక్రమ రవాణను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సీఎం జగన్‌మ ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చి తక్షణం అమలు అయ్యె విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గనులు మరియు పోలీసు శాఖలకు చెందిన అధికారులు , మంత్రులతో సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏపీలో ఇసుక కొరత తీర్చేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్న జగన్ సర్కార్, సమస్యను అధిగమించేందుకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇసుక కొరత, అక్రమ రవాణపై కొరడా ఝలిపించేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా ఇసుక కోరత కారణంగా ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు . సమస్యను అధిగమించేందుకు అధికారులతో సమావేశం అయ్యారు.

new laws for sand transport : cm jagan review

పలు రీచ్‌ల్లో ఇసుక అభ్యమవుతున్నా.. ప్రజలకు అందుబాటులో రాకపోవడంతో పాటు అధిక ధరలు కూడ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాులు ప్రభుత్వంపై దాడిని పెంచాయి. ఇసుక కార్మికుల సమస్యలు తీర్చాలంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు జనసేన పార్టీలు తమ ఆందోళనను తీవ్రతరం చేసిన సంధర్భంలో ప్రత్యేక చట్టం తేవాలని సీఎం జగన్ నిర్ణయించారు.

తక్షణం అమల్లోకి వచ్చే విధంగా ఆర్డినెన్స్ కూడ తీసుకురానున్నారు. దీంతో ఇసుక మాఫియాకు కల్లెం వేయనున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డితోపాటు ఇతర మంత్రులు అధికారులు పాల్గోన్నారు.

English summary
ap cm jagan mohan reddy hold review meeting on sand shortage and order to take new laws on sand rates , illegal transport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X