చంద్రబాబు ఇంటికి మరింత రక్షణ: 40 లక్షలతో రాడార్ వ్వవస్థ
అమరావతి: విజయవాడలోని ఉండవల్లి కరకట్టపై ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే పలు సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బెజవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి, వివిధ జిల్లాలకు ఇక్కడ నుంచే సీఎం వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే సీఎం ఇంటి చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్, ఇతర భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం ఇంటికి ఉన్న రోడ్డు మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు తాజాగా నదీ తీరం వెంబడి దృష్టి సారించారు. దీని కోసం నదీ తీరం వెంబడి ‘యూ' ఆకారంలో ఫ్లోటింగ్ బారియర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సీఎం ఇంటి చుట్టూ నదీ తీరం వెంబడి ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ బారియర్ (తేలియాడే కంచె)కు రూ.30 నుంచి 40 లక్షలు ఖర్చు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నదీ తీరం వెంబడి కోస్టల్ బోట్లపై భద్రతా సిబ్బందిని నియమించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా ఫ్లోటింగ్ బారియర్ ఏర్పాటు చేయడం వల్ల నదీ తీరం వెంబడి కూడా పూర్తి సెక్యూరిటీ కల్పించనట్లు అవతుందని ముఖ్యమంత్రి సెక్యూరిటీ విభాగం అధికారులు భావిస్తున్నారు. ఈ ప్లోటింగ్ బారియర్ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా బారియర్‌ను తాకేందుకు ప్రయత్నిస్తే అలారం మోగుతుంది.
ఇందు కోసం ఈ ప్లోటింగ్ బారియర్‌ను మెటల్‌తో రూపొందించనున్నారు. సీఎం నివాసానికి రెండు వైపులా కవర్ చేసేలా మొత్తం 400 మీటర్లు ఉండేలా ‘యూ' ఆకారంలో ఈ ప్లోటింగ్ బారియర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఫ్లోటింగ్ బారియర్ వద్ద ప్రత్యేక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం నివాసం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రాడార్ పరిధిలోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications