• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో విడదల రజనీ గురించి వింత ప్రచారం..! కాబోయే సీఎం అంటూ ఆసక్తికర చర్చ..!!

|

అమరావతి/హైదరాబాద్ : చదవడానికి ఈ వార్త చాలా విచిత్రంగా అనిపించినా తెలుసువాలని మాత్రం తెగ ఆత్రుతగా ఉంది కదూ.. ఔను.. వైసీపి ఎమ్మెల్యే విడదల రజనీ గురించి ఆమె నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. జగన్ రాక్షసుడు అంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు భారీ ఉన్యాసం ఇచ్చి చంద్రబాబు కంట్లో పడిన విడదల రజనీ ఇప్పుడు ఏపి రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారినట్టు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే రజనీ ఇపుడు ఏపీ సోషల్ మీడియాలో తిరుగులేని తారగా ఆమె అభిమానులు అభివర్ణిస్తున్నారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా రజనీ గురించే చర్చ జరగుతుండం ఆమె ఫాలోంయింగ్ ఎంత దూరం దూసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు ఆమె అనుచరులు.

గురువును మించిన శిష్యురాలు.. పత్తిపాటి పుల్లారావును మట్టికరిపించిన విడదల రజని..

గురువును మించిన శిష్యురాలు.. పత్తిపాటి పుల్లారావును మట్టికరిపించిన విడదల రజని..

కాగా తెలుగుదేశం పార్టీలో ఉండగా తనను రాజకీయారంగేట్రం చేయించిన మాజీ మంత్రి పుల్లారావు సీటునే కావాలని చంద్రబాబు దగ్గర ఒత్తిడి తెచ్చింది విడదల రజని. గురువును మించిన శిష్యురాలిగా పత్తిపాటి పుల్లారావుకు తెలియకుండా నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టుకుంటాను, నాకు సీటు ఇవ్వండి, గెలిచి చూపిస్తానని మతిపోయే ప్రతిపాదన పెట్టిందట రజని. దిమ్మతిరిగిన చంద్రబాబు ఎగాదిగా చూసి, అడగడానికి అయినా అర్థం ఉండాలి కదమ్మా... మొన్నే రాజకీయాల్లోకి వచ్చావు, పైగా నిన్ను పరిచయం చేసిన మనిషి సీటే అడుగుతున్నావు అని మందలించినంత పని చేసారట చంద్రబాబు. అంతే మెల్లగా అక్కడి నుంచి తప్పుకున్న రజనీ చంద్రబాబును కలవడం అదే చివరిసారని ఆమె అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

జగన్ కు రజని బంపరాఫర్.. వైసీపి నుండి అనూహ్యంగా సీటు దక్కించుకున్న రజని..

జగన్ కు రజని బంపరాఫర్.. వైసీపి నుండి అనూహ్యంగా సీటు దక్కించుకున్న రజని..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకున్న డబ్బుతో జగన్ దగ్గర తన ప్రత్నాలకు పదును పెట్టారు రజని. రాజధాని నిర్మాణానికి పూనుకున్న బాబును కాదని గుంటూరు జిల్లా ప్రజలు తనకు ఓటేస్తారా అన్న అనుమానంతో ఉన్న జగన్ కు రజని బంపరాఫర్ ఇచ్చిందట. తనకు సీటు కేటాయిస్తే పార్టీకి మంచి నిధులు అందిస్తానని, నియోజకవర్గంలో ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడనని జగన్ వాగ్దానం చేసిందట రజని. జగన్ కు పెద్దగా ఆ సీటుపై ఆశలు లేవని, అది మంత్రి పుల్లారావు సీటని, అక్కడ పుల్లారావే గెలుస్తాడని జగన్ భావించారు. ఓడిపోయే సీటును ఇస్తే పోయేదేముందని రజని ప్రతిపాదనకు అంగీకారం చెప్పారు జగన్. 20 ఏళ్లుగా తమ కుటుంబంతో ఉన్న మర్రి రాజశేఖర్ కు ఆ సీటు ఇచ్చినా అతని డబ్బులు పోవడం తప్ప ఉపయోగం లేదు. మర్రి రాజశేఖర్ మరేదైనా నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చన్న ఉద్దేశంతో ఆయనను కాదని జగన్, రజనీకి బీఫాం ఇచ్చారు.

అందంతో పాటు చురుకుదనం ఆమె ఎస్సెట్.. అందుకే రజనీకి ఫాన్స్ ఎక్కువ..

అందంతో పాటు చురుకుదనం ఆమె ఎస్సెట్.. అందుకే రజనీకి ఫాన్స్ ఎక్కువ..

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ ఊహించని రేంజ్ లో పార్టీ గెలించింది, పార్టీతో పాటు రజని కూడా మాంచి ఆదిఖ్యంతో గెలుపొందారు. అలా 28 ఏళ్లకే వారసత్వం లేకుండా ఎమ్మెల్యే అయ్యారు విడదల రజని. డబ్బు ధైర్యంతో పాటు మంచి చురుకుదనం, అందం రజనీ సొంతం. అంతే కాకుండా ప్రజల్లో విపరీతంగా తిరుగే స్వభావం రజనీది. ఆ క్రమంలో మాస్ కి బాగా దగ్గరయ్యారు రజని. సరిగ్గా ఇదే సమయంలో జగన్ కి ఏకుమేకై కూర్చోంది రజని. నెల రోజుల్లో ఆమె తన నియోజక వర్గంలో చేసిన షో అంతా ఇంతా కాదనే చర్చ జరుగుతోంది. కరోనా విషయంలో విపరీతంగా తిరుగుతూ తెగ హడావుడి చేస్తోంది. పార్టీ విధానాలను లెక్కచేయకుండా తనకు నచ్చింది చేసుకుంటూ పోతోంది రజని.

రజని ఏపి కాబోయే సీఎం.. ఆకాంక్షిస్తున్న రజనీ అనుచరులు..

రజని ఏపి కాబోయే సీఎం.. ఆకాంక్షిస్తున్న రజనీ అనుచరులు..

సోషల్ మీడియాలోనే కాకుండా ప్రసార మాధ్యమాల్లో ఆమెకు తిరుగులేని పబ్లిసిటీ వచ్చింది. అయితే రజని అనుచరులూ, శ్రేయోభిలాషులు, అనుయాయుల అత్యుత్సాహం ఎక్కడికో వెళ్లినట్టు తెలుస్తోంది. ఏపీకి కాబోయే సీఎం రజనీయే అని విచిత్ర ప్రచారం చేస్తున్నారు ఆమె వీరాభిమానులు. విడ‌ద‌ల ర‌జ‌నీ కాబోయే సీఎం అంటూ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో పాటు ఆమెకేం తక్కువ అంటున్నారు. ఆమె విజ‌న్‌, సేవాగుణం.. అన్నీ కూడా సీఎంకు ఉండాల్సిన అర్హత‌ల‌కు ఏమాత్రం తీసిపోవ‌ని అనేక రూపాల్లో ఆమె గురించి సోష‌ల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈమె వ్యవహారాన్ని లోతుగా ప‌రిశీలిస్తున్న వైసీపీ నేతలకు మాత్రం రజనీ ఎపిసోడ్ చిత్ర విచిత్రంగా అనిపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

English summary
There is talk that MLA Rajni has now become the focal point of AP politics. MLA Rajani is now seen as an undisputed star on AP social media. Her followers are also aware of how far she has come in the wake of the debate over Rajni, even during the coronation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X