తిరుపతి కేంద్రంగా కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్‌..!?

తిరుపతి కేంద్రంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం పరిశీలిస్తోంది. దేశంలోనే అత్యంత రద్దీ పుణ్య క్షేత్రాలలో తిరుపతి ఒకటి. ప్రతి ఏటా రూ.250 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న మూడో స్టేషన్‌గా ఈ ప్రాంతం నిలిచింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు.. పెద్ద సంఖ్యలో రైళ్లు తిరుపతికి రాకపోకలు సాగిస్తాయి. తిరుపతి కేంద్రం గా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు పైన రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద ప్రతిపాదనల పైన సానుకూల ప్రకటన దిశగా కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి కేంద్రంగా కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్‌ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. అవసరాల దృష్ట్యా దీనిని తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా డివిజన్‌ సాధన సమితి సభ్యులు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసి తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలోనే అత్యంత రద్దీ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉన్న తిరుపతికి ప్రతి ఏటా రూ.250 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిధి ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. దీని కారణంగా ఈ ప్రాంత రైల్వే అవసరాలు తీర్చడంలో చాలా చిక్కులు ఎదురవుతున్నాయి. రైల్వే డివిజన్ ఏర్పాటు ద్వారా సమస్యలు తగ్గుముఖం పడతాయని భావిస్తు న్నారు.దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటుచేయనున్నారు. ఇది రాయలసీమకు దూరంగా ఉంది.

new-proposal-before-aswini-vaishnav-over-balaji-railway-division-at-tirupati

అదే విధంగా విజయవాడ, గుంటూరు డివిజనల్‌ కార్యాలయాలు అమరావతి ప్రాంతంలో ఉన్నా యి. ఈ నేపథ్యంలో డివిజనల్‌ ప్రధాన కార్యాలయం దక్షిణ రాయలసీమలోని తిరుపతి ప్రాంతానికి లేకుండా పోతోంది. అందుకే తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌ను ఏర్పాటు చేయడం న్యాయ బద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రమంత్రికి సమర్పించిన వినతి పత్రంలో తిరుపతి-ఒంగోలు, తిరుపతి-కాట్పాడి, పాకాల-ధర్మవరం, రేణిగుంట-ఎర్రగుంట్ల, ఎర్రగుంట్ల-నంద్యాల, శ్రీకాళహస్తి-నడికుడి, ఓబుళవారిపల్లె-కృష్ణపట్నం, కడప-బెంగుళూరుల మధ్య 1,550 కిలో మీటర్ల దూరం ఉన్న సెక్షన్లతో తిరుపతి డివిజన్‌ను ఏర్పాటుచేయాలని వారు కోరారు. దీంతో.. రైల్వే శాఖ సానుకూలంగా ఉందని.. త్వరలోనే అధ్యయనం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+