• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గ‌ణ‌ప‌తి పూజ‌..న‌ల్ల‌కోడి బ‌లి, కుక్కుట శాస్త్రం: కోడి పందాల్లో చిత్రాలు..!

|

సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే కోడి పందేలు కామ‌న్ అయిపోయింది. ఎంత మంది ఎన్ని నిబంధ‌న‌లు పెట్టినా.. ఏపి లో అవ‌న్నీ నామ మాత్రంగానే అమ‌ల‌వుతాయి. వేల కోట్ల రూపాయాల పందాలు జ‌రుగుతాయి. కొద్ది కాలం క్రితం వ‌ర‌కు గోదావ‌రి జిల్లాల‌కే ప‌రిమిత‌మైన ఈ కోడి పందాలు ఇప్పుడు రాయ‌ల‌సీమ వ‌ర‌కు విస్త‌రించాయి. ఇక‌, ఈ కోడి పందాల‌లో అనుస‌రించే పూజ‌లు..న‌మ్మ‌కాలు..ఆచారాలు కొత్త వారికి చాలా విచిత్రంగా ఉంటాయి...

గ‌ణ‌ప‌తి పూజ‌..న‌ల్ల‌కోడి బ‌లి..

గ‌ణ‌ప‌తి పూజ‌..న‌ల్ల‌కోడి బ‌లి..

ఈ కోడి పందాల కోసం పందెం రాయుళ్లు అక్క‌డా దేవుడి మీదే భారం వేస్తున్నారు. కోడిపందేలు, గుండాటలు, పేకాట పోటీలు నిర్వహించడానికి బరులను సిద్ధం చేశారు. అయితే ఈ పందాల్లోనూ శాస్త్ర ప్ర‌కారం ప్రారంభిస్తారు. ముందుగా త‌మ విజ‌యాన్ని ఆకాంక్షిస్తూ గ‌ణ‌ప‌తి పూజ నిర్వ‌హిస్తారు. పూజాది కార్యాక్ర‌మాలు నిర్వ‌హించిన త‌రువాత పందె జ‌రిగే బ‌రి వ‌ద్ద న‌ల్ల‌కోడిని కొన్ని ప్రాంతాల్లో బ‌లి ఇస్తారు. సాధార‌ణంగా గ‌ణ‌ప‌తి పూజ చేసే వారు బ‌లులు ఇవ్వ‌రు. కానీ, కోడి పందేల నిర్వ‌హ‌కులు మాత్రం పూజ‌లు నిర్వ‌హిస్తారు...బ‌రి వ‌ద్ద బలి ఇస్తారు. ఇక‌, తాము పందెం కోసం ఆరు నెల‌ల ముందు నుండి సిద్దం చేసుకున్న కోళ్ల‌ను బ‌రిలోకి దించుతారు. గోదావ‌రి జిల్లాల్లో పందెం రాయుళ్లు విశాఖ లో ప్ర‌త్యే కంగా శిక్ష‌ణ పొంద‌ని కోళ్ల‌ను రంగంలోకి దించుతున్నారు.

బ‌రిలోకి రాజ‌కీయ‌ పుంజులు, ప‌ందేల వెల రూ. 2 వేల కోట్లు: భారీ కాన్వాయ్ తో త‌ల‌సాని...

కుక్కుట శాస్త్రం..బ‌రిలో సాంప్ర‌దాయం

కుక్కుట శాస్త్రం..బ‌రిలో సాంప్ర‌దాయం

గోదావ‌రి జిల్లాల్లో కోడి పందేల కోసం ఓ సాంప్ర‌దాయాన్ని పాటిస్తారు. అందులో కుక్క‌ట శాస్త్రం ప్ర‌ధాన‌మైన‌ది. బ‌రిలోకి దిగే పందెం రాయుళ్లు ఏ రకం పుంజులు గెలుస్తాయో తెలుసుకోవడానికి కుక్కుట(కోడి) శాస్త్రంపై చాలా మంది ఆధార పడతారు. అందులోని సూత్రాల ప్ర కారం సంక్రాంతికి 6 నెలలకు ముందుగానే కోళ్లను సిద్ధం చేస్తారు. వాటితో ఈత కొట్టించ డం, జీడిపప్పు దగ్గర నుంచి మాంసం వరకు మేతగా వేసి బలీయంగా తయారు చేస్తారు. ఈ తరహా కోళ్లు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతాయి. పార్టీల‌కు అతీతంగా అన్ని పార్టీల నేత‌లు ఈ సారి ఎన్నిక‌ల‌ను దృ ష్టిలో ఉంచుకొని ఆస‌క్తి ఉన్న వారిని ఆక‌ట్టుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో..నిబంధ‌ల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ పందేలు నిర్వ‌హిస్తున్నారు. అందులో పార్టీలు..రాజ‌కీయాలు ఏవీ అడ్డు కావు. తెలంగాణ తో పాటుగా క‌ర్నాట‌క వం టి ప్రాంతాల నుండి ఈ పందేల‌ను తిల‌కించ‌టానికి ఆస‌క్తితో ఏపికి త‌ర‌లి వ‌స్తున్నారు.

 పైకి అనుమ‌తులు... లేకున్నా..విచ్చ‌ల‌విడిగా..

పైకి అనుమ‌తులు... లేకున్నా..విచ్చ‌ల‌విడిగా..

ఏపిలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. దీంతో..పందేల నిర్వాహ‌కుల‌ను కాద‌న‌లేని ప‌రిస్థితుల్లో అధికా ర పార్టీ నేత‌లున్నారు. కొంద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులే స్వ‌యంగా ఈ పందాల్లో పాల్గొంటున్నారు. ఇక‌, తాజాగా ప‌శ్చిమ గోదా వ‌రి జిల్లాలో కోడిపందాలపై నిర్వహణపై జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నిర్వాహకులు కోడి పందాల కో సం బరులు సిద్ధం చేశారు. కాగా పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కోడిపందాలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీ సుల అధికారిక అనుమతి కోసం నిర్వాహకులు ఎదురుచూపులు చేస్తున్నారు. ఈ సారి రాయ‌ల‌సీమ లోనూ కోడి పందా లు భారీగా జ‌ర‌గుతున్నాయి. రాయచోటి, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కోడూరు నియోజకవర్గాల పరిధి లో పెద్ద ఎత్తున పందేలు కాస్తారు. మూడురోజుల్లో రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల దాకా పందేలు జరుగుతాయి. అయితే కడప జిల్లా నుం చి పందెం కాసేవారు భీమవరం, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలకు వెళ్లారు. వీరంతా రూ.20 కోట్ల పైచిలుకు పందేలు కాస్తుంటారు. మొత్తంగా ఈ సారి సంక్రాంతి కోడి పందాలు ఏపి మొత్తం గా సంద‌డి..సంచ‌ల‌నం..సంబ‌రం సృష్టిస్తున్నాయి.

English summary
Cock fight in Godavari districts are drawing attention during the festive season in the telugu states.Many politicians irrespective of parties are taking part in this cock fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X