వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలకు కొత్త తరహా వేధింపులు...తస్మాత్ జాగ్రత్త అంటున్నపోలీసులు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆ అమ్మాయికి సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొంతమంది యువకులు తాము ఓ ఎన్జీవో ఏర్పాటు చేశామని ఆమెతో చెప్పారు. ఆ సంస్థలో సభ్యురాలిగా చేరమని అడిగారు. ఆమె ప్రొఫైల్‌ను తీసుకున్నారు. కొంతకాలం గడిచింది...

ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసింది....ఆ తర్వాత జరిగిన పరిణామాలు....ఆమెకు జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చాయి...

ఆ తర్వాత ఏం జరిగిందంటే...ఆమె మొబైల్ ఫోన్ కు ఎవరెవరో కాల్ చెయ్యడం...ఏదేదో మాట్లాడటం మొదలుపెట్టారు. వారు మాట్లాడుతున్న మాటలు విని ఆమె దిగ్భ్రాంతి చెందింది. తానెన్నడూ ఊహించని ఈ పరిణామానికి ఆమె మానసికంగా కుంగిపోయి డిప్రెషన్లో కూరుకుపోయింది. ఇలాంటిదే మరో రకమైన ఇబ్బంది ఇంకో అమ్మాయికి ఎదురైంది....బిటెక్ పూర్తయిన ఓ అమ్మాయికి కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కొత్తగా మరో నలుగురు బాయ్స్ పరిచయమయ్యారు.

వారిలో ఒకడు ఆమెను బాగా ఇష్టపడ్డాడు. అతడు ప్రపోజ్‌ చేయడంతో ఈ అమ్మాయి కూడా సరేనంది. ఈ ప్రేమాయణం కొద్దిరోజుల బాగానే సాగింది. కానీ ఇతగాడు గతంలో ఇలాగే మరో ముగ్గురు అమ్మాయిలను ప్రేమ ముసుగులో మోసం చేశాడని తెలియడంతో ఆమె అతడితో రిలేషన్ కట్ చేసింది. దీంతో ఆమె మీద పగ పెంచుకున్న అతడు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. అందులో ఆమె ఫొటో, ఫోన్‌ నంబర్‌ను పెట్టాడు. నేను డేటింగ్‌కు రెడీ అంటూ ట్యాగ్ లైన్ పెట్టాడు. దీంతో ఇక ఆ అమ్మాయికి ఫోన్ కాల్స్ వెల్లువ.

అమరావతిలో ఏర్పాటుచేసిన ఫైబర్ గ్రిడ్ తరహా ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో బుధవారం ఫైబర్ గ్రిడ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా నినాదాన్ని అందిపుచ్చుకున్నామన్నారు.

రూ. 5వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును కేవలం రూ. 330 కోట్లతో పూర్తి చేశామని సీఎం అన్నారు. ప్రతి గ్రామంలో హాట్‌స్పాట్‌తో వైఫై ఇస్తామన్నారు. 2018 నాటికి కోటి వీడియో కాన్ఫరెన్స్‌ సిస్టమ్స్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని, రాజధానికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

 ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి...

ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి...

సోషల్ మీడియా విజృంభణ నేపథ్యంలో ఇటీవలికాలంలో అమ్మాయిలకు ఈ తరహా వేధింపులు పెచ్చుమీరిపోయాయి. ఇప్పటి టెక్నాలజీకే మార్ఫింగ్‌లతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నఅమ్మాయిలకు ఇప్పుడు ఈ తరహా వేధింపులు కూడా తోడయ్యాయి.

Recommended Video

Vodafone Private Recharge Smart Offer For Girls Only - Oneindia Telugu
 గ్రూప్ లతో తస్మాత్ జాగ్రత్త...

గ్రూప్ లతో తస్మాత్ జాగ్రత్త...

కాలేజీలు, జాబ్ ప్లేసెస్, ఏరియావైజ్, ఆలుమ్నీస్, ఎడ్యుకేషన్ ఇలా వివిధ అంశాలను బేస్ చేసుకొని వాట్సాప్ లో వివిధ రకాల పేర్లతో పెద్ద ఎత్తున గ్రూపులు ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. వీటిలో కామన్‌ ఫ్రెండ్స్‌ని యాడ్ చేసేస్తున్నారు. వీళ్లలో ఎవరో ఒకరికి ఒక అమ్మాయి గాళ్ ఫ్రెండ్‌గా ఉంటుంది. ఆమెతో సంబంధాలు సవ్యంగా ఉన్నంతకాలం ఆమెని బాగనే చూసుకుంటున్నారు. ఒకవేళ ఏదో ఒక కారణంతో ఆ బంధం తెగిపోతే మాత్రం ఆమెకి చుక్కలు చూపిస్తున్నారు. ఆమె పేరు, మొబైల్ నంబర్ను ఆయా గ్రూపుల్లో పోస్ట్‌ చేసి కాల్‌ గర్ల్‌ అని పెట్టేస్తున్నారు. కాల్‌గర్ల్‌ అని ఉండడంతో ఆ తరహా ఆసక్తి ఉన్న యువకులందరూ తమకు తెలిసిన వారికి, తెలియని వారికి ఆ పోస్ట్ షేర్‌ చేసేస్తున్నారు. ఒక్కసారి ఆ నంబర్ ఓ అమ్మాయిది అని తెలిస్తే చాలు ఇక ఆనంబర్ కు కాల్స్ అపరిమితంగా చేస్తున్నారు.

 ఆ నంబర్ మార్చలేక సతమతం...

ఆ నంబర్ మార్చలేక సతమతం...

అనుకోకుండా ఇలాంటి ఉచ్చులో చిక్కుకొని ఇటు ఇంట్లో వాళ్లకు చెప్పలేక, అటు ఎన్నో ఏళ్లుగా ఉన్న మొబైల్ నంబర్‌ను మార్చుకోలేక అమ్మాయిలు సతమతమైపోతున్నారు. చాలా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.

 పోలీసు వారి హెచ్చరిక...

పోలీసు వారి హెచ్చరిక...

ఈమధ్య కాలంలో ఈ తరహా ఫిర్యాదులు చాలా ఎక్కువగా వస్తున్నాయని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఒక్కో అమ్మాయిది ఒక్కో బాధాకరమైన అనుభవం అని ,వాటిల్లో అస్సలు ఊహించని విధంగా వేధింపులు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారని వివరిస్తున్నారు. కాబట్టి టెలిగ్రామ్‌ వంటి వాటిల్లో గ్రూపులు, సేవ ముసుగులో ప్రొఫైల్‌ తీసుకున్న వారివిషయంలో అమ్మాయిలు అప్రమత్తంగా అత్యంత ఉండాలని పోలీసు అధికారి ఈ సందర్భంగా సూచించారు.

English summary
An unknown person copied a photo of vijayawada based teenager from her social media account and morphed her face on a naked body. Thereafter, the person sent the morphed photo with objectionable comments to the girl, asking her to meet him, else he would make the picture viral. The terrified teenager then informed her parents who gave a complaint to the police. The police said that the case has been referred to the cyber cell for detailed investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X