వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్. ఆవేశపూరిత అభిప్రాయాలకు నెలవు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం యువజన విభాగం 'యువరాజ్యం' అధ్యక్షుడిగా నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు 'అత్తారింటికి దారేది' సినిమాతోపాటు.. తెలంగాణ విభజన తీరుపై తీవ్రస్థాయిలో గళమెత్తిన సినీ ప్రముఖుడు. 2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమి తరఫున ప్రచారంచేసి విజయాన్ని చేకూర్చిన జనసేన అధినేత..

Recommended Video

Pawan Kalyan Is Quitting From Films
News Maker 2017- Jana Sena chief Pawan Kalyan

తర్వాత కూడా ప్రశ్నిస్తున్నానంటూ కీలక సందర్భాల్లో మాత్రమే ప్రజల్లోకి వెళుతున్న నాయకుడు. పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తారన్న విమర్శ ఉంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రజా సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడల్లా పవన్ కల్యాణ్ ప్రత్యక్షమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నల్లో చిత్తశుద్ది ఉందని, సమస్యలపై ఆయన ప్రశ్న సరైనదని చాలామంది భావిస్తుంటారు.

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం కదిలి వచ్చే విధంగా వ్యవహరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సమస్యలను గుర్తించి, బాధితుల వద్దకు వెళ్లి వారిని పలకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారనే ప్రశంసలు అందుకున్నారు.

English summary
News Maker 2017 - Jana Sena chief and Power Star Pawan Kalyan. He is questioning TDP and BJP about Special Status issue after 2014 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X