వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ కే రోజా
రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ నటి ఆర్ కే రోజా. 1999 ఎన్నికల్లో తొలుత నగరి స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి పాలైన రోజా 2004, 2009 ఎన్నికల్లోనూ అదే పార్టీ తరఫున ఓడిపోయారు. కానీ 2009 ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజా.. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Recommended Video


నాటి నుంచి అధికార టీడీపీపై, చివరకు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు వెనుకాడలేదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఓటమి అనంతరం 2014లో వైసీపీ నుంచి గెలుపొందారు. గత ఏడాది అసెంబ్లీ నుంచి ఏడాది పాటు బహిష్కరణకు గురవడం, చంద్రబాబుపై విరుచుకుపడటం వంటివి చర్చనీయాంశంగా మారుతుంటాయి.
జబర్దస్త్ టీవీ షో ఆమెకు కీర్తితో పాటు అపకీర్తిని కూడా తెచ్చిపెట్టింది. ఆ షో అశ్లీలంగా ఉందనే కారణంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెపై అందులోని విషయాలను తీసుకుని విమర్శలు చేయడం ద్వారా నిత్యం వార్తల్లో నిలిచారు. అదే స్థాయిలో ఆమె చంద్రబాబుపై విరుచుకుపడుతూ ప్రతి రోజూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications