తదుపరి లక్ష్యం పులివెందులే, 2019 ఎన్నికలు ఏకపక్షమేనంటూ బాబు సంచలనం
2019 ఎన్నికలు ఏకపక్షంగానే సాగుతాయని చంద్రబాబు చెప్పారు. రానున్న రోజుల్లో టిడిపి ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉందన్నారు బాబు.
అమరావతి: 2019 లో ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.రానున్న రోజుల్లో అన్ని ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో ఆయన చిట్ చాట్ చేశారు. ఎన్నికల ఫలితాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తమ పార్టీ తర్వాతి లక్ష్యం పులివెందుల అని చంద్రబాబునాయుడు చెప్పారు.వైసిపి ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి పోటీచేస్తే ఏం జరుగుతోందో చూద్దామన్నారు.
ఎంపిటీసి, జడ్ పి టిసి సభ్యులకు ఫిరాయింపుల చట్టం వర్తించదని బాబు చెప్పారు. ఈ ఎన్నికల నాటికి వైసిపికి గుర్తింపే లేదని బాబు చెప్పారు.రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను నమోదు చేసుకొంటామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications